Hyderabad: మాజీ మంత్రి నారాయణపై కృష్ణప్రియ కేసు
ABN , First Publish Date - 2023-07-31T15:47:39+05:30 IST
హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణ మరదలి వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. నిన్నటి వరకు నారాయణపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసిన ఆయన సోదరుడు సుబ్రహ్మణం భార్య కృష్ణప్రియ ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: మాజీ మంత్రి (Ex Minister) నారాయణ (Narayana) మరదలి వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. నిన్నటి వరకు నారాయణపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. సోషల్ మీడియా (Social Media)లో వీడియోలు (Videos) పోస్టు చేసిన ఆయన సోదరుడు సుబ్రహ్మణం (Subrahmanam) భార్య కృష్ణప్రియ (Krishnapriya) ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను లైంగికంగా వేధిస్తున్నారని ఇదే విషయాన్ని వీడియోల ద్వారా ఇప్పటికే వెల్లడించానన్నారు. ఈ విషయం తన భర్త సుబ్రహ్మణ్యంకు కూడా తెలుసునని అన్నారు. అందుకే నారాయణకు దూరంగా కోల్కతాకు వెళ్లిపోయినట్లు కృష్ణప్రియ వెల్లడించారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే కొద్ది రోజులుగా నారాయణ, అయన కుటుంబంపై కృష్ణప్రియ తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పెడుతున్నారు. దీనిపై నారాయణ సోదరుడు, కృష్ణప్రియ భర్త పొంగూరు సుబ్రహ్మణ్యం స్పందించారు. తన భార్య కొద్ది రోజులుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని, పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించామని తెలిపారు. వాటికి తగిన ఆధారాలు కూడా ఆయన మీడియా సమావేశంలో చూపించారు. ఇదే సమయంలో కృష్ణప్రియకు క్యాన్సర్ చికిత్స జరుగుతున్నందున సైక్రాటిక్ మందులు నిలిపివేశారన్నారు. కృష్ణప్రియ వీడియోలను మానవతా ధృక్పధంతో ఎవరూ పట్టించుకోవద్దని సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు.