Share News

సమస్యలు పరిష్కరించని సమావేశాలెందుకు ?

ABN , First Publish Date - 2023-11-27T21:49:24+05:30 IST

సమస్యలు పరిష్కరిం చలేని మండల సమావేశాలు ఎందుకని పురంధరపురం,జొన్నవాడ సర్పంచులు సోము నిర్మల, కందికట్టు పెంచలయ్య ప్రశ్నించారు. సోమవారం బుచ్చి మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి టీడీపీ మద్దతుదారులైన పురంధరపురం,జొన్నవాడ సర్పంచులు తమ గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి నేలపై బైఠాయించి, నిరసన

సమస్యలు పరిష్కరించని సమావేశాలెందుకు ?
1బీఆర్‌పీ27 : బుచ్చి మండల మీట్‌లో నేలపై బైఠాయించి నిరసన తెలుపుతున్న సర్పంచులు

మండల మీట్‌లో బైఠాయించిన సర్పంచులు

బుచ్చిరెడ్డిపాళెం,నవంబరు27: సమస్యలు పరిష్కరిం చలేని మండల సమావేశాలు ఎందుకని పురంధరపురం,జొన్నవాడ సర్పంచులు సోము నిర్మల, కందికట్టు పెంచలయ్య ప్రశ్నించారు. సోమవారం బుచ్చి మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి టీడీపీ మద్దతుదారులైన పురంధరపురం,జొన్నవాడ సర్పంచులు తమ గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి నేలపై బైఠాయించి, నిరసన తెలిపారు. ప్రతిపక్ష సర్పంచుల విలువలను కాపాడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పురంధరపురంలో 700మంది ఉండే స్కూలు వద్ద పంచాయతీ అనుమతి లేకుండా సెల్‌టవర్‌ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన చెందారు. అనంతరం వారు సర్పంచుల సమస్యలను ప్రస్తావించగా, ఇతర సర్పంచుల సమస్యలు మీకవసరంలేదు, మీవి మాత్రం చెప్పండని అధికారులు తెలిపారు. అఽధికార నేతలకు ప్రజాప్రతినిధులకు అడ్డుగా ముందు వరుసలోనే కూర్చోవడంపై పలు విమర్శలు రేగాయి. ఈ సమావేశంలో పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, అఽధికారులు పాల్గొన్నారు.

అధికారులపై మండిపాటు

వ్యవసాయశాఖలో పచ్చిరొట్ట విత్తనాలు, ఎరువులు, తెగుళ్ల సమస్యలపై రైతులకు అవగాహన కల్పించకుండా గ్రామస్థాయి వ్యవసాయ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని పెనుబల్లి ఎంపీటీసీ సీహెచ్‌ వినయ్‌నారాయణ మండిపడ్డారు. పెనుబల్లి- జొన్నవాడ గుంతలమయం అయిందని , కనీసం మరమ్మతులు చేపట్టలేదని ఆర్‌అండ్‌బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరైనా స్పందించి ఆమార్గంలో గోతులు పూడ్చాలని ఆయన కోరారు.

--------------

Updated Date - 2023-11-27T21:49:26+05:30 IST