Share News

విద్యతోపాటు సేవాభావం అలవర్చుకోవాలి

ABN , First Publish Date - 2023-11-27T21:45:49+05:30 IST

విద్యార్థులు విద్యతోపాటు సేవాభావం అలవర్చుకోవాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కావలి మండలం తుమ్మలపెంట బాలికల గురుకుల పాఠశాలను సోమవారం ఎమ్మెల్యేతోపాటు ఆయన సతీమణి

 విద్యతోపాటు సేవాభావం అలవర్చుకోవాలి
27కెవిఎల్‌ 3: ఎమ్మెల్యేతోపాటు ఎన్‌ఆర్‌ఐను సన్మానిస్తున్న స్కూల్‌ కాంప్లెక్స్‌ చైర్మన్‌ రాధాక్రిష్ణ

కావలి రూరల్‌, నవంబరు27: విద్యార్థులు విద్యతోపాటు సేవాభావం అలవర్చుకోవాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కావలి మండలం తుమ్మలపెంట బాలికల గురుకుల పాఠశాలను సోమవారం ఎమ్మెల్యేతోపాటు ఆయన సతీమణి ఆదిలక్ష్మి, ఎన్‌ఆర్‌ఐ క్రిష్ణకుమార్‌, ఆయన సతీమణి సంధ్య తదితరులు సందర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము పేద కుటుంబానికి చెందిన వారమేనని, చదువు తోనే అభివృద్ధి చెంది 10 మందికి సహాయపడుతున్నామన్నారు. ఎన్‌ఆర్‌ఐ క్రిష్ణకుమార్‌ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం పాఠశాల తరగతి గదులు, డైనింగ్‌ హాలును పరిశీలించారు.తదుపరి ఎమ్మెల్యే, ఎన్‌ఆర్‌ఐను హెచ్‌ఎం, తదితరులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి శ్రీనివాసులు, ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు నాగన్నగారి శ్రీనివాసులు, తిరుపతి, దుర్గాప్రసాద్‌, రాజు, అళహరి చిట్టిబాబు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-27T21:45:52+05:30 IST