Share News

షోకాజ్‌ నోటీసులను ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2023-11-27T00:16:23+05:30 IST

చిన్న చిన్న కారణాలకు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు, చార్జ్‌ మెమోలు ఇస్తున్నారని, వాటిని ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌ నవకోటేశ్వరరావు తెలిపారు.

షోకాజ్‌ నోటీసులను ఉపసంహరించుకోవాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి నవకోటేశ్వరరావు

ఏఎస్‌ పేట, నవంబరు 26: చిన్న చిన్న కారణాలకు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు, చార్జ్‌ మెమోలు ఇస్తున్నారని, వాటిని ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌ నవకోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన ఏఎస్‌ పేటలో నిర్వహించిన యూటీఎఫ్‌ మండల సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడుతూ అధికారులు పాఠశాలల తనిఖీల్లో సిలబస్‌ పూర్తి కాలేదని, వర్క్‌ బుక్కులు దిద్దలేదనే కారణాలతో షోకాజ్‌ నోటీసులు ఇస్తున్నారని వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు రావసిన ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని జిల్లా కోశాధికారి మురళీధరరావు తెలిపారు. అనంతరం షేక్‌ జిలానీ పాషాను గౌరవ అధ్యక్షులుగా, కేవీ వరప్రసాద్‌ను అధ్యక్షులుగా, ఈ శ్రీనివాసులును అసోసియేట్‌ అధ్యక్షులుగా, యశోదమ్మను ప్రధాన కార్యదర్శిగా మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Updated Date - 2023-11-27T00:16:24+05:30 IST