Share News

స్పందనకు పోటెత్తిన జనం

ABN , First Publish Date - 2023-11-27T23:42:58+05:30 IST

కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జగనన్నకు చె జగనన్నకు చెబుదాం(స్పందన) కార్యక్రమానికి జనం పోటెత్తారు. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు అర్జీలు సమర్పించారు.

స్పందనకు పోటెత్తిన జనం
అర్జీలు స్వీకరిస్తున్న జేసీ కూర్మనాథ్‌

నెల్లూరు(హరనాథపురం), నవంబరు 27 : కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జగనన్నకు చె జగనన్నకు చెబుదాం(స్పందన) కార్యక్రమానికి జనం పోటెత్తారు. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు అర్జీలు సమర్పించారు. అర్జీలు స్కీరించిన జాయింట్‌ కలెక్టర్‌ వాటిని పరిశీలించి సంబంధిత అధికారులను పిలిపించి ఆ సమస్యలను తక్షణం పరిష్కరించాలని సూచించారు. వచ్చిన అర్జీలే మళ్లీ మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

దివ్యాంగులకు ఎన్‌హెచ్‌ఎఫ్‌డీసీ రుణాలు ఇప్పించాలని కోరుతూ నవ్యాంధ్ర వికాలాంగుల హక్కువల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ కాలేషా వినతిపత్రం సమర్పించారు. ఈ రుణాల కోసం 32 దరఖాస్తులు సమర్పించామని, ఒక్కరిఇక కూడా రుణాలు అందచేయాలేదన్నారు.

హమాలీ, ట్రాన్స్‌పోర్టు చార్జీలు ఇప్పించండి

రైతులకు హమాలీ చార్జీలు, ట్రాన్స్‌పోర్టు చార్జీలకు సంబంధించి డీసీఎంఎస్‌కు విడుదలైన డబ్బును రైతులకు ఇప్పించాలని కోరుతూ జేసీకి కోవూరుకు చెందిన టీడీపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. గత ఏడాది మార్చి నెల నుంచి ధాన్యం మోసిన కూలీలకు చెల్లించాల్సిన నగదును ప్రభుత్వం చెల్లించకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతు నాయకులు ఆయనకు వివరించారు. రైతుల కోసం పోరాటం చేసే టీడీపీ నాయకులను పగటి వేషగాళ్లని ఎద్దేవా చేసే ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి డీసీఎంఎస్‌ ద్వారా రైతులకు రావాల్సిన రూ.2కోట్ల విషయం తేల్చాలన్నారు. టీడీపీ నాయకులు చెముకుల కృష్ణచైతన్య, ఇంతా మల్లారెడ్డి, యద్దలపూడి నాగరాజు, రైతు నాయకులు మాతురు శ్రీనివాసులరెడ్డి, వేతు వెంకటరవణారెడ్డి తదితరులు ఉన్నారు.

===============

Updated Date - 2023-11-27T23:42:59+05:30 IST