Share News

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం: యనమల

ABN , First Publish Date - 2023-11-29T04:39:51+05:30 IST

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అప్పుల్ల్లో దేశంలోనే ఏపీ నంబర్‌ 1గా మారిందని శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం: యనమల

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అప్పుల్ల్లో దేశంలోనే ఏపీ నంబర్‌ 1గా మారిందని శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తెలిపారు. రాష్ట్ర ప్రజలపై అప్పులభారం లెక్కలేనంతగా పెరిగిదని తెలిపారు. కాగా, ఏపీలో ఉన్నది ప్రజాస్వామ్యమా? రెడ్డి రాజుల రాజ్యమా? అనే సందేహం కలుగుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రధాని మోదీకి సీఎం నుంచి జిల్లా అధికారుల వరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు మాత్రమే స్వాగతం పలకడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. కాగా, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర హెచ్చరికలు చేశారు. టీడీపీ యువనేత లోకేశ్‌ పాదయాత్రపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు అయ్యన్న ‘ఎక్స్‌’ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. ‘మూడు నెలల తర్వాత ఏ దేశం పారిపోదామా అని ప్లాన్లు వేస్తున్నావట.. సప్తసముద్రాల అవతల దాక్కున్నా, లాక్కొచ్చి తిన్నదంతా కక్కించి, పేలిన ప్రతి తప్పుడు కూతకీ వాత పెట్టించి, బొక్కలో వేస్తా’మని విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-11-29T04:39:53+05:30 IST