Share News

All Time Record: భారీగా పెరిగిన కోడిగుడ్ల ధర

ABN , First Publish Date - 2023-12-12T11:40:07+05:30 IST

అమరావతి: కార్తీకమాసం ముగియడంతో కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ విశాఖ హోల్‌ సేల్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ. 580గా ఉంది. అదే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ. 584గా నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ ఖరారు చేసింది.

All Time Record: భారీగా పెరిగిన కోడిగుడ్ల ధర

అమరావతి: కార్తీకమాసం (Month of Kartik) ముగియడంతో కోడిగుడ్ల ధరలు (Egg prices) భారీగా పెరిగాయి (Hugely Increased). ఇవాళ విశాఖ హోల్‌ సేల్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్ల ధర రూ. 580గా ఉంది. అదే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ. 584గా నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ ఖరారు చేసింది. ఈ రేటు ఆల్ టైమ్ రికార్డు అని అధికారులు చెబుతున్నారు. రిటైల్ మార్కెట్‌లో వ్యాపారులు ఒక్కో గుడ్డును 6-50, 7 రూపాయలకు అమ్ముతున్నారు. అన్ని జిల్లాల్లో దాదాపు ఇదే రేటు ఉంది.

కార్తీక మాసంలో కోడిగుడ్లు, చికెన్, మటన్, చేపల ధరలు బాగా తగ్గాయి. ఎందుకంటే చాలా మంది ఆ నెలలో గుడ్లు, మాంసాహారం తీసుకోరు. ఈ నేపథ్యంలో ధరలు బాగా తగ్గాయి. కొనుగోలు దారులు తగ్గడంతో షాపులు వెలవెలబోయాయి. ఇప్పుడు కార్తీక మాసం ముగియడంతో కొనుగోలు దారులు పెరగడంతో చికెన్, మటన్, చేపల ధరలు కొంచెం పెరిగాయి. ముఖ్యంగా కోడి గుడ్ల ధరలు మాత్రం భారీగా పెరిగాయి.

Updated Date - 2023-12-12T11:42:19+05:30 IST