Share News

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌కు రూ.1,950 కోట్ల రుణాలు

ABN , First Publish Date - 2023-11-29T01:42:29+05:30 IST

జీఎంఆర్‌ ఎయిర్‌ పోర్ట్స్‌ రూ.1,950 కోట్ల రుణాలను సమీకరించింది. స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌, డాయిష్‌ బ్యాంక్‌ ఈ నిధులు అందించినట్లు తెలుస్తోంది...

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌కు రూ.1,950 కోట్ల రుణాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జీఎంఆర్‌ ఎయిర్‌ పోర్ట్స్‌ రూ.1,950 కోట్ల రుణాలను సమీకరించింది. స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌, డాయిష్‌ బ్యాంక్‌ ఈ నిధులు అందించినట్లు తెలుస్తోంది. మూడేళ్లకు చెల్లించే విధంగా అన్‌ సెక్యూర్డ్‌ బాండ్ల ద్వారా జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఈ నిధులు పొందింది. అధిక వడ్డీ రేటు ఉన్న రుణాలను తీర్చడానికి, అనుబంధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి వీటిని వినియోగిస్తుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం రూ.5,000 కోట్లను రుణాల ద్వారా సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగానే రూ.1,950 కోట్లను సమీకరించినట్లు చెబుతున్నారు. డిసెంబరులో మరో రూ.2,300 కోట్లను, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రూ.800 కోట్లను సమీకరించే వీలుంది.

Updated Date - 2023-11-29T01:42:31+05:30 IST