Share News

కేశోరామ్‌ సిమెంట్‌పై అదానీ ఆసక్తి

ABN , First Publish Date - 2023-11-29T01:41:19+05:30 IST

కేశోరామ్‌ ఇండస్ట్రీ్‌సకు చెందిన సిమెంట్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్‌ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అంబుజా సిమెంట్‌, ఏసీసీ కంపెనీల కొనుగోలు ద్వారా...

కేశోరామ్‌ సిమెంట్‌పై అదానీ ఆసక్తి

న్యూఢిల్లీ: కేశోరామ్‌ ఇండస్ట్రీ్‌సకు చెందిన సిమెంట్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్‌ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అంబుజా సిమెంట్‌, ఏసీసీ కంపెనీల కొనుగోలు ద్వారా దేశంలో రెండో అతిపెద్ద సిమెంట్‌ ఉత్పత్తిదారుగా అవతరించిన అదానీ గ్రూప్‌.. 2027-28 నాటికి వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 14 కోట్ల టన్నులకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే అదానీ మరిన్ని సిమెంట్‌ కంపెనీల కొనుగోలు చేసేందుకు అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఈ ఆగస్టులోనూ అదానీ గ్రూప్‌.. ప్రముఖ సిమెంట్‌ తయారీదారుల్లో ఒకటైన సంఘీ ఇండస్ట్రీ్‌సలో 56.74 శాతం వాటాను రూ.5,000 కోట్లకు కొనుగోలు చేసింది.

పోటీలో అలా్ట్రటెక్‌ సైతం: దేశంలో అతిపెద్ద సిమెంట్‌ తయారీదారైన అలా్ట్రటెక్‌ సిమెంట్‌ కూడా కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌ సిమెంట్‌ వ్యాపారం కొనుగోలుకు ఆసక్తిగా ఉన్నట్లు గత వారంలో వార్తలు వచ్చాయి. కేశోరామ్‌ ఇండస్ట్రీ్‌సలో ప్రమోటర్ల వాటా కొనుగోలు చేయడం లేదా సిమెంట్‌ వ్యాపారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

బసంత్‌ నగర్‌లోని ప్లాంట్‌ కేశోరామ్‌దే: బీకే బిర్లా గ్రూప్‌నకు చెందిన కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌.. సిమెంట్‌తో పాటు టైర్లు, ట్యూబ్‌లు, రేయాన్‌, పేపరు, భారీ రసాయనాలు, స్పన్‌ పైప్స్‌ తయారీ వ్యాపారాలు సాగిస్తోంది. అయితే, కంపెనీ మొత్తం ఆదాయంలో సిమెంట్‌ వ్యాపారానిదే మెజారిటీ వాటా. బిర్లా శక్తి బ్రాండ్‌నేమ్‌తో సిమెంట్‌ విక్రయిస్తున్న కేశోరామ్‌ ఇండస్ట్రీ్‌సకు తెలంగాణలోని బసంత్‌నగర్‌తో పాటు కర్ణాటకలోని సదామ్‌లో సిమెంట్‌ ప్లాంట్లున్నాయి.

Updated Date - 2023-11-29T01:41:22+05:30 IST