Share News

సిడ్నీ ఐడీతో భారత్‌ బయోటెక్‌ ఒప్పందం

ABN , First Publish Date - 2023-11-29T01:45:24+05:30 IST

అడ్వాన్స్‌ వ్యాక్సిన్‌ పరిశోధనల కోసం భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌, యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ ఇనిస్టిట్యూట్‌...

సిడ్నీ ఐడీతో భారత్‌ బయోటెక్‌ ఒప్పందం

కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధికి కృషి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అడ్వాన్స్‌ వ్యాక్సిన్‌ పరిశోధనల కోసం భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌, యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ ఇనిస్టిట్యూట్‌ (సిడ్నీ ఐడీ) చేతులు కలిపాయి. ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్లా తెలిపారు. ఈ ఒప్పందంతో అకాడమీ-పరిశ్రమ బంధాలు కూడా మరింత బలపడతాయి. భవిష్యత్తులో వచ్చే అంటు వ్యాధులు, ఎపిడిమిక్స్‌ను కట్టడి చేయడానికి కొత్త మెథడాలజీలను అభివృద్ధి చేయడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని సిడ్నీ ఐడీ డిప్యూటీ డైరెక్టర్‌ జామీ ట్రికాస్‌ అన్నారు. కోట్ల మందిని వ్యాధుల నుంచి తక్కువ ఖర్చుతో సమర్థంగా రక్షించడానికి వ్యాక్సిన్లు ఒక్కటే సరైన మార్గమని అన్నారు. భవిష్యత్‌లో వచ్చే మహమ్మారిలను ఎదుర్కోవడానికి భారత్‌లో వ్యాక్సిన్ల అభివృద్ధిపై గణనీయమైన పెట్టుబడులు పెడుతున్నట్లు కృష్ణ ఎల్లా అన్నారు.

Updated Date - 2023-11-29T01:45:26+05:30 IST