Share News

టెక్‌ వ్యూ కీలక స్థాయి 19,850 వద్ద పరీక్ష

ABN , First Publish Date - 2023-11-28T02:42:32+05:30 IST

నిఫ్టీ గత వారం 19,700 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమై మైనర్‌ అప్‌ట్రెండ్‌ లో పురోగమించి ప్రధాన నిరోధం 19,850 వరకు వెళ్లింది. కాని మైనర్‌ రియాక్షన్‌లో పడి చివరికి 19,800 వద్ద ముగిసింది...

టెక్‌ వ్యూ కీలక స్థాయి 19,850 వద్ద పరీక్ష

టెక్‌ వ్యూ

కీలక స్థాయి 19,850 వద్ద పరీక్ష

నిఫ్టీ గత వారం 19,700 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమై మైనర్‌ అప్‌ట్రెండ్‌ లో పురోగమించి ప్రధాన నిరోధం 19,850 వరకు వెళ్లింది. కాని మైనర్‌ రియాక్షన్‌లో పడి చివరికి 19,800 వద్ద ముగిసింది. మార్కెట్‌ ఇప్పటికీ స్వల్పకాలిక నిరోధం 19,850 కన్నా దిగువనే ఉంది. టెక్నికల్‌గా మూడు వారాలుగా సాగుతున్న స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కొనసాగుతోంది. వరుసగా నాలుగో వారం అప్‌ట్రెండ్‌ కనబరిచిన మార్కెట్‌ రెండు నెలల్లో నాలుగో సారి 19,850 వద్ద పరీక్ష ఎదుర్కొంటున్నందు వల్ల స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.

బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌ కోసం నిఫ్టీ 19,850 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధ స్థాయి 20,000. ఆ పైన 20,200. ఇదే జీవితకాల గరిష్ఠ స్థాయి కావ డం వల్ల మరింత అప్‌ట్రెండ్‌లో పురోగమించాలంటే ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి.

బేరిష్‌ స్థాయిలు: 19,850 వద్ద పరీక్షలో విఫలమైతే అప్రమత్తతను సూచిస్తుంది. మద్దతు స్థాయి 19,650. ఇక్కడ కూడా విఫలమైతే మరింత బలహీనపడుతుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 19,500. ప్రస్తుత అప్‌ట్రెండ్‌లో భద్రత కోసం ఇక్కడ నిలదొక్కుకోవడం తప్పనిసరి. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగుతుంది. అప్రమత్తత అవశ్యం.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం పరిమిత పరిధిలో కదలాడి 180 పాయింట్ల లాభంతో 43,770 వద్ద ముగిసింది. మరింత అప్‌ట్రెండ్‌ కోసం ప్రధాన నిరోధం 44,000 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 44,400. మద్దతు స్థాయి 43,400 కన్నా దిగజారితే మరింత బలహీనపడుతుంది.

పాటర్న్‌: మార్కెట్‌ స్వల్పకాలిక ఓవర్‌బాట్‌ స్థితికి చేరుతోంది. సానుకూలత కోసం 19,850 వద్ద ఏర్పడిన ‘‘రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ను బ్రేక్‌ చేయాలి.

మంగళవారం స్థాయిలు

నిరోధం : 19,850, 19,910

మద్దతు : 19,760, 19,700

వి. సుందర్‌ రాజా

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి రివర్సల్‌ ఉంది.

Updated Date - 2023-11-28T02:51:25+05:30 IST