Share News

ఐఓసీకి రిలయన్స్‌ కేజీ డీ6 గ్యాస్‌

ABN , First Publish Date - 2023-11-29T01:40:09+05:30 IST

కేజీ-డీ6 బ్లాక్‌లో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, దాని భాగస్వామి బీపీ ఉత్పత్తి చేసే సహజ వాయువులో మూడింట ఒక వంతు గ్యాస్‌ను...

ఐఓసీకి రిలయన్స్‌ కేజీ డీ6 గ్యాస్‌

న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌లో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, దాని భాగస్వామి బీపీ ఉత్పత్తి చేసే సహజ వాయువులో మూడింట ఒక వంతు గ్యాస్‌ను ప్రభుత్వ రంగంలోని ఐఓసీ దక్కించుకుంది. గత వారం ఉభయ సంస్థలు వేలం వేసిన రోజుకి 4 ఎంఎంఎ్‌ససీఎండీ గ్యాస్‌లో 1.45 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ను ఐఓసీ దక్కించుకుంది. గతంలో నిర్వహించిన రెండు వేలాల్లోనూ కూడా ఐఓసీ టాప్‌ బిడ్డర్‌గా నిలిచింది. ఐఓసీతో పాటు సిటి గ్యాస్‌ కంపెనీలైన టొరెంట్‌ గ్యాస్‌, గుజరాత్‌ గ్యాస్‌ 2.21 ఎంఎంఎ్‌ససీఎండీ గ్యాస్‌ పొందాయి. గ్యాస్‌ వినియోగ రంగాలైన ఎరువులు, సిటీ గ్యాస్‌, రిఫైనరీలు, అగ్రిగేటర్లు వేలంలో పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T01:40:11+05:30 IST