Apsara Murder Case : దండం పెడుతున్నా.. మాకు ఏ న్యాయం వద్దు.. అంతా ఆయనే చూసుకుంటారన్న అప్సర తల్లి..!

ABN , First Publish Date - 2023-06-11T14:47:18+05:30 IST

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గంటకో ట్విస్ట్.. రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తుండటంతో అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఇదే బర్నింగ్ టాపిక్ అయ్యింది...

Apsara Murder Case : దండం పెడుతున్నా.. మాకు ఏ న్యాయం వద్దు.. అంతా ఆయనే చూసుకుంటారన్న అప్సర తల్లి..!

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గంటకో ట్విస్ట్.. రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తుండటంతో అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఇదే బర్నింగ్ టాపిక్ అయ్యింది. ఆదివారం నాడు ఉదయం నుంచి అప్సర ఇదివరకే పెళ్లయ్యిందని.. వివాహమైన కొద్దిరోజులకే భర్త ఆత్మహత్య చేసుకున్నారని.. ఆ తర్వాతే చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే జాతకం చూపించుకోవడానికి వెళ్లగా బంగారు మైసమ్మ దేవాలయంలో పూజారి సాయికృష్ణతో అప్సరకు పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీయడంతో పెళ్లి చేసుకోవాలని సాయిపై అప్సర ఒత్తిడి తెచ్చింది. దీంతో అప్సరను అంతమొందించాలని ప్లాన్ చేసిన సాయి.. జూన్-03న హైదరాబాద్ సిటీ బయటికి తీసుకెళ్లి గుట్టుచప్పుడు కాకుండా హత్య చేశాడు.

Apsara-Marriage-First.jpg

మమ్మల్ని వదిలేయండి..!

అప్సరకు పెళ్లయ్యిందన్న వార్తల్లో నిజమెంత..? అసలు చెన్నై నుంచి హైదరాబాద్ ఎందుకొచ్చారు..? సాయికృష్ణతో అప్సర పరిచయం ఎలా అయ్యింది..? అనే విషయాలపై అప్సర తల్లి అరుణను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కొన్నింటికి సమాధానాలు ఇచ్చిన ఆమె.. మరికొన్నింటికి సమాధానం చెప్పలేక దండం పెట్టేశారు.

మీడియా : అమ్మాయి ఏం చేస్తుంటదమ్మా..?

అప్సర తల్లి : ఏమీ చేయదు.. ఉత్తిగానే ఇంట్లో ఉంటుంది..

మీడియా : అమ్మాయి ఏం చదువుకుంది..? ఏమైనా జాబ్స్‌కు ట్రై చేస్తోందా..?

అప్సర తల్లి : డిగ్రీ చదువుకుంది..

మీడియా : మీరు కూడా బంగారు మైసమ్మ గుడికి వెళ్లేవారా..?

అప్సర తల్లి : అవును వెళ్తుంటాను.. గుడిలోనే అప్సరకు పరిచయం అయ్యింది. సాయికృష్ణ పేరెంట్స్ కూడా ఇది మాట చెబుతున్నారు కదా..

మీడియా : సాయిని పోలీసులు నేరస్థుడిగా తేల్చారు..? మీరు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు..?

అప్సర తల్లి : మాకు ఏ న్యాయం వద్దు.. మమ్మల్ని వదిలేస్తే అదే చాలు.. మాకు ఎవరూ న్యాయం చేయనక్కర్లేదు.. భగవంతుడు ఉన్నాడు.. ఆయన ఎలా శిక్షించాలో.. అలా శిక్షిస్తాడు..

Apsara-Mother.jpg

మీడియా : ఫొటోలు వాళ్లే (సాయికృష్ణ తరఫున) బయటపెట్టారా..? మీ అమ్మాయికి గతంలోనే పెళ్లయ్యిందా..?

అప్సర తల్లి : నాకేం తెలుసండి.. అప్సరకు పెళ్లయిందా..? లేదా..? అనే గతం గురించి అనవసరం. ప్రస్తుతం జరిగిన సంఘటన మీది దృష్టి పెట్టండి.. (దండం పెడుతూ) చనిపోయిన బిడ్డకు ఆత్మ శాంతి లేకుండా చేస్తున్నారు. కనబడనంతవరకు కూడా అప్సర వస్తుందని అనుకున్నాను. కానీ చివరికి శవమై తేలింది.

మీడియా : సాయికృష్ణతో కలిసి కోయంబత్తూరు వెళ్తున్నట్లు అప్సర చెప్పిందా..?

అప్సర తల్లి : అవును.. నాకు చెప్పింది..

Apsara-Latest.jpg

కాగా.. నిన్న, మొన్నటి వరకూ అప్సరకు జరిగినట్లుగా మరో ఆడబిడ్డకు ఇలా జరగకుండా ఉండాలంటే సాయికృష్ణని ఉరితీయాలని డిమాండ్ చేసిన అప్సర తల్లి.. ఇప్పుడు మమ్మల్ని వదిలేస్తే చాలు మహాప్రభో అనే పరిస్థితి..! అయితే పోలీస్ స్టేషన్లు, కోర్టులు.. ఆరోపణలు ఇవన్నీ భరించలేక అప్సర తల్లి ఇలా మాట్లాడి ఉండొచ్చని బంధువులు చెబుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి అప్సర పెళ్లి గురించి వార్తలు, ఫొటోలు కూడా బయటికి రాగా వాటిపై అప్సర తల్లి స్పందించలేదు. ఒకవేళ పెళ్లి నిజం కాకపోతే అపద్ధమని చెప్పొచ్చు కదా.. మౌనం అంగీకారమేనే ఆరోపణలు కూడా సాయికృష్ణ కుటుంబీకుల నుంచి వస్తున్నాయి. అప్సర పేరెంట్స్ నుంచి క్లారిటీ రాలేదు గనుక.. ఈ వ్యవహారంపై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.

Apsara-Photos.jpg

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Apsara Murder Case : షాకింగ్.. అప్సరకు ముందే పెళ్లయ్యిందా.. మొదటి భర్త ఆత్మహత్య చేసుకున్నాడా..? ఫుల్ క్లారిటీ రావాలంటే..!


******************************

Apsara Murder Case : సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సోషల్ మీడియాలో ఇప్పుడంతా ఇదే హాట్ టాపిక్..
******************************Apsara Murder Case : శంషాబాద్ అప్సర హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. పిన్ టూ పిన్ వివరాలు ఇవే..!

******************************

Apsara Murder Case : అప్సర హత్యకు ముందు, ఆ తర్వాత అసలేం జరిగిందో.. పోలీసులకు పూసగుచ్చినట్లుగా చెప్పిన సాయి..

******************************

Apsara Murder Case : సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో బిగ్ ట్విస్ట్..

******************************

Apsara Murder Case : ఢిల్లీ నుంచి గల్లీ దాక సంచలనాత్మక హత్య కేసుల్లో నిందితులందరికీ సహకారం అందించింది ‘ఒక్కరే’..!

******************************

Updated Date - 2023-06-11T15:07:09+05:30 IST