Home » Hyderabad
మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల సౌలభ్యం కోసం వివిధ మార్గాల్లో నడిచే 4 ఎక్స్‌ప్రెస్ రైళ్ల(Express trains)ను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
నగరంలో దేశీవాళి తుపాకుల విక్రయాలు కలకలం రేపుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం వచ్చిన నేరగాళ్లు, అధిక సంపాదన కోసం దేశీవాళీ తుపాకులను తెచ్చి నగరంలో విక్రయిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా, మచిలీపట్నం, మంగెనపూడికి చెందిన మలిశెట్టి దేవహర్ష(26) గచ్చిబౌలిలోగల కేక టెక్నాలజీస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ కుత్బుల్లాపూర్ ప్రాంతంలోని లక్ష్మీగణేష్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు.
రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ ప్రాంతంలో ఓ జంట దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు పుప్పాలగూడ పద్మనాభ స్వామి ఆలయం గుట్టపై ఓ వివాహిత, మరో యువకుడిని కిరాతకంగా చంపేశారు.
తన అన్న కూతురిని ఓ యువకుడు ప్రేమిస్తుండటాన్ని సహించలేక సదరు యువతి చిన్నాన్న అతనిపై కసి పెంచుకున్నాడు. అతని కుటుంబ సభ్యులను హతమార్చాలనుకున్నాడు.
పేపర్ హ్యాకర్లు (పత్రికలను ఇంటింటికి వేసే వారు) ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివా్‌సరెడ్డి హామీ ఇచ్చారు.
సరదాల సంక్రాంతి కొన్ని కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చింది. పతంగులు, మాంజాలు యమపాశాలుగా మారి నలుగురిని పొట్టనబెట్టుకోగా.. పలువురు మెడ భాగాల్లో మాంజా కోసుకుని, తీవ్ర గాయాలపాలయ్యారు.
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ సుజాయ్పాల్ను రాష్ట్రపతి నియమించారు. ఈ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
తెలంగాణ: ఫార్ములా-ఈ కార్ రేసు(Formula-E car race) కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పుపై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)కు చెంపపెట్టని ఆయన ఎద్దేవా చేశారు.
Telangana: అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రకాష్ (60) అనే వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ అఘాయిత్యానికి ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. అల్వాల్‌లో నివాసముండే ప్రకాష్ కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.