Share News

Hyderabad: నేడు రాష్ట్రపతి రాక.. ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , Publish Date - Nov 21 , 2024 | 06:40 AM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) గురు, శుక్రవారాల్లో నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో రెండురోజులపాటు ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ విశ్వప్రసాద్‌ పేర్కొన్నారు. వాహనదారులు ఆంక్షలను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

Hyderabad: నేడు రాష్ట్రపతి రాక.. ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ సిటీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) గురు, శుక్రవారాల్లో నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో రెండురోజులపాటు ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ విశ్వప్రసాద్‌ పేర్కొన్నారు. వాహనదారులు ఆంక్షలను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hanumakonda: తండ్రిని పట్టించుకోని కొడుక్కి తగిన శాస్తి


గురువారం (నేడు)

సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కింది ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిపివేయడం లేదా మళ్లింపు చేయనున్నారు. బేగంపేట ఫ్లైఓవర్‌, హెచ్‌పీఎ్‌స అవుట్‌గేట్‌, శ్యామ్‌లాల్‌ బిల్డింగ్‌, పీపీఎన్‌టీ ఫ్లైఓవర్‌, ఎయిర్‌పోర్టు వై జంక్షన్‌, మోనప్ప జంక్షన్‌, యశోద హాస్పిటల్‌, కత్రియా హోటల్‌, రాజ్‌భవన్‌రోడ్డు, మెట్రో రెసిడెన్సీ, వీవీ విగ్రహం, ఖైరతాబాద్‌ ఫ్లైవోవర్‌, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగుతల్లి జంక్షన్‌, తెలుగుతల్లి వంతెన, కట్టమైసమ్మ ఆలయం, ఇక్బాల్‌ మినార్‌, పాత అంబేడ్కర్‌ విగ్రహం జంక్షన్‌, ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, అశోక్‌నగర్‌ జంక్షన్‌.


శుక్రవారం (రేపు)

ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఈ జంక్షన్లలో కాసేపు ట్రాఫిక్‌ నిలిపివేయనున్నారు. రాజ్‌భవన్‌ కుడివైపు నుంచి వీవీ విగ్రహం కుడివైపు, కేసీపీ అన్సారీ మంజిల్‌- తాజ్‌కృష్ణ1/7 రోడ్డు, 1/4 రోడ్డు, ఎన్‌ఎ్‌ఫసీఈఎల్‌ ఎస్‌ఎన్‌టీ, సాగర్‌ సొసైటీ, ఎన్టీఆర్‌ భవన్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, రోడ్డు నంబర్‌-45 జంక్షన్‌, కేబుల్‌బ్రిడ్జి, రోడ్డు నంబర్‌-65, జూబ్లీహిల్స్‌, ఎన్టీఆర్‌ భవన్‌, సాగర్‌ సొసైటీ, ఎస్‌ఎన్‌టీ- ఎన్‌ఎ్‌ఫసీఎ్‌స, పంజాగుట్ట వంతెన, ప్రజాభవన్‌, బేగంపేట వంతెన, హెచ్‌పీఎ్‌స అవుట్‌గేట్‌, శ్యామ్‌లాల్‌ బిల్డింగ్‌, విమానాశ్రయం వైజంక్షన్‌, బేగంపేట ఎయిర్‌పోర్టు.


ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ క్యాడర్‌ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడిగా రాంరెడ్డి

ఈవార్తను కూడా చదవండి: Midday Meal: మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌

ఈవార్తను కూడా చదవండి: TET: ముగిసిన టెట్‌ గడువు..22 వరకు ఎడిట్‌ ఆప్షన్‌

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ పర్యటన.. రోడ్డెక్కిన దళిత సంఘాల నాయకులు..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 21 , 2024 | 06:40 AM