Home » Andhrajyothi
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) గురు, శుక్రవారాల్లో నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో రెండురోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. వాహనదారులు ఆంక్షలను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
‘అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల... కాదేదీ కళకు అనర్హం’ అంటాడు స్కాట్లాండ్కు చెందిన శిల్పకారుడు డేవిడ్ మాక్. అగ్గిపుల్లలతో మహాత్మాగాంధీ, చార్లీచాప్లిన్, మార్లిన్ మన్రో వంటి ప్రసిద్ధుల ప్రతిమలు రూపొందించడంలో దిట్ట ఆయన. మ్యాచ్స్టిక్స్ కళాఖండాల తయారీలో రకరకాల రంగుల్లో లభించే జపాన్ అగ్గిపుల్లలను వినియోగించాడు.
పడవపై కుదురుగా కూర్చుని, తెడ్డేస్తూ నదిలో ఓ పది నిమిషాలు పాటు నడపడమే ఎంతో కష్టం. అలాంటిది గుమ్మడికాయను పడవగా చేసుకొని... దానిపై ఏకధాటిగా 26 గంటల పాటు ప్రయాణించి ‘ఔరా’ అనిపించాడో పెద్దాయన.
విహార ప్రదేశాలంటే అందమైన సరస్సులు, జలపాతాలు, కట్టడాలే కాదు... యుద్ధభేరి మోగిన ప్రాంతాలు, సైనికుల వీరత్వగాధలు, రక్తం ఏరులై పారిన ప్రదేశాలు కూడా... అలాంటి యుద్ధ స్మారకాలను వీక్షిస్తే... ఉద్వేగభరితంగా మారిపోతాం. చరిత్ర ఘటనలను కళ్లకు కట్టేలా లైట్ అండ్ సౌండ్షో రూపంలో చూస్తుంటే... ఆనాటి యుద్ధ స్మృతులు మనల్ని చుట్టుముడతాయి.
నేను కథలు రాస్తానని మా బంధువుల్లో, స్నేహితుల్లో చాలామందికి తెలుసు. కొందరు అప్పడప్పుడు వాళ్ళకు జరిగిన కొన్ని సంఘటనలు చెప్పి, దీన్ని నువ్వు చక్కని కథగా రాయవచ్చు అంటుంటారు.
కావలసిన పదార్థాలు: లేత నల్లేరు కాడలు - ఒక కప్పు, నూనె - 3 టేబుల్ స్పూన్లు, నువ్వులు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు - పావు కప్పు చొప్పున. మెంతులు - పావు టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, వెల్లుల్లి - 10 రెబ్బలు, చింతపండు - చిన్న నిమ్మకాయంత, కరివేపాకు - గుప్పెడు, ఎండుమిర్చి - 15, ఉప్పు - రుచికి.
కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ - ఒక కప్పు, కొబ్బరి పాలు - 3 కప్పులు, పల్లీలు, జీడిపప్పు (కలిపి) - గుప్పెడు, నూనె: 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - ఒక టీ స్పూను, శనగపప్పు, మినప్పప్పు - 2 టీ స్పూన్లు చొప్పున, అల్లం, పచ్చి మిర్చి తరుగు - ఒక స్పూను చొప్పున, ఉల్లితరుగు - అరకప్పు, కరివేపాకు, కొత్తిమీర - గుప్పెడు, ఉప్పు - రుచికి సరిపడా.
అనేక యజ్ఞాలు చేసిన మాంధాత పాయసం, అపూపం, మోదకాలతో వేదపండితులకు విందు ఇచ్చినట్టు భారతం ద్రోణపర్వంలో తిక్కనగారి వర్ణన ఇది. ‘‘సూపా పూపై శ్శర్కరాద్యైః పాయసైః ఫలసంయుతైః’’ యజ్ఞానంతరం వేదవిదులకు సూపం (పప్పు), పంచదార చల్లిన అపూపం, పాయసం, పండ్లతో భోజనం పెట్టాలని శంకరాచార్యుల వారు లలితా త్రిశతి భాష్యంలో చెప్పారు. తిక్కన అదే రాశారు.
క్వాలిటీ స్వీట్ అంటే మహా అయితే కిలో వెయ్యి, రెండు వేల రూపాయలకు లభిస్తుంది. జైపూర్లోని ‘త్యోహార్’ అనే మిఠాయి దుకాణం ఒక ప్రత్యేకమైన స్వీటును తయారుచేసి, కిలో ఏకంగా 70 వేల రూపాయలకు అమ్ముతోంది. పది గ్రాముల బంగారం ధరకు ఇంచుమించుగా ఉన్న ఈ ‘గోల్డ్ స్వీట్’ కథేంటీ...
తాజా పండ్లలో పిండిపదార్థాలు, పీచు, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫీనాల్స్ వంటి ఎన్నో పోషకాలుంటాయి. పిండిపదార్థాల నుంచి క్యాలరీల రూపంలో శక్తి వస్తుంది. పండ్లలోని పీచు వల్ల మితంగా తీసుకున్నా ఆకలి తీరుతుంది. అదే పండ్లను జ్యూస్ చేసి వడపోసినప్పుడు వాటిలోని పీచుపదార్థాలు పోతాయి.