Hyderabad: అయ్యప్ప మాలతో దర్గాకు ఎలా వెళతారు.. రామ్‌చరణ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి
ABN , Publish Date - Nov 21 , 2024 | 08:20 AM
సినీనటుడు రామ్‌చరణ్(Film actor Ram Charan) అయ్యప్ప దీక్షలో ఉండి దర్గాకు వెళ్లి హిందువులు, అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతీశారని తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక (అయ్యప్ప జేఏసీ) ఆరోపించింది. దీక్షలో ఉండి మాల వేసుకుని దర్గాకు ఎలా వెళ్తారని అయ్యప్ప జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నాయని బుచ్చిరెడ్డి గురుస్వామి ప్రశ్నించారు.
హైదరాబాద్: సినీనటుడు రామ్‌చరణ్(Film actor Ram Charan) అయ్యప్ప దీక్షలో ఉండి దర్గాకు వెళ్లి హిందువులు, అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతీశారని తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక (అయ్యప్ప జేఏసీ) ఆరోపించింది. దీక్షలో ఉండి మాల వేసుకుని దర్గాకు ఎలా వెళ్తారని అయ్యప్ప జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నాయని బుచ్చిరెడ్డి గురుస్వామి ప్రశ్నించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వేదిక కన్వీనర్లు రాధాకృష్ణ గురుస్వామి, ప్రేమ్ గాంధీ గురుస్వామి, ఇతర స్వాములతో కలిసి మాట్లాడారు. అయ్యప్పస్వామి దీక్షలో నిష్టగా ఉండాలని సూచించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కార్లలో మంటల వెనుక.. తీగల ట్యాంపరింగే కారణం..
దర్గా లోపలికి వెళ్లినప్పుడు బొట్టును తుడిపించారని, మాల వేసుకున్నాక నియమ నిబంధనలు ఉంటాయని, అశుభం జరిగినప్పుడు మాత్రమే మాల, బొట్టు తీస్తారని అన్నారు. రామ్‌చరణ్‌కి అయ్యప్ప మాల వేసిన గురుస్వామి జ్ఞానోదయం కల్పించాలన్నారు. దీనిపై రామ్‌చరణ్ వివరణ ఇవ్వాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దర్గాకు వచ్చేవారు తక్కువ అయ్యారనే ఏఆర్ రెహమాన్ కుట్ర పూర్వకంగానే రామ్‌చరణ్‌ను దర్గాకు వెళ్లమన్నారని అన్నారు.
రెహమాన్‌ని కూడా శబరిమలకు నిష్ఠగా మాల వేసుకుని తీసుకురాగలరా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతుంటే.. రామ్‌చరణ్ అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లారని అన్నారు. ఈ సంఘటన బాధాకరమని, తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సనాతన ధర్మం, అయ్యప్పలను అవమానిస్తే సహించేది లేదన్నారు. వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని, రామ్‌చరణ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయన అయ్యప్ప ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. సమావేశంలో వేదిక ప్రతినిధులు, అయ్యప్ప స్వాములు ప్రదీప్ గురుస్వామి, సుదర్శన్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ క్యాడర్ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడిగా రాంరెడ్డి
ఈవార్తను కూడా చదవండి: Midday Meal: మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
ఈవార్తను కూడా చదవండి: TET: ముగిసిన టెట్ గడువు..22 వరకు ఎడిట్ ఆప్షన్
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ పర్యటన.. రోడ్డెక్కిన దళిత సంఘాల నాయకులు..
Read Latest Telangana News and National News