Share News

Hyderabad: కాంగ్రెస్‌ నేత వార్నింగ్.. ఇష్టానుసారంగా మాట్లాడితే సహించం

ABN , Publish Date - Nov 21 , 2024 | 10:46 AM

ఎమ్మెల్యే గాంధీపై ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు చిరుమర్తి రాజు బీఆర్‌ఎస్‌ నాయకులను హెచ్చరించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గాంధీపై బీఆర్‌ఎస్‌ మేడ్చజ్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు చేసిన వాఖ్యలను బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఖండించారు.

Hyderabad: కాంగ్రెస్‌ నేత వార్నింగ్.. ఇష్టానుసారంగా మాట్లాడితే సహించం

- బీఆర్‌ఎస్‌ నాయకులకు కాంగ్రెస్‌ నేత చిరుమర్తి రాజు హెచ్చరిక

హైదరాబాద్: ఎమ్మెల్యే గాంధీ(MLA Gandhi)పై ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు చిరుమర్తి రాజు(Chirumarthi Raju) బీఆర్‌ఎస్‌ నాయకులను హెచ్చరించారు. శేరిలింగంపల్లి(Serilingampally) నియోజకవర్గం ఎమ్మెల్యే గాంధీపై బీఆర్‌ఎస్‌ మేడ్చజ్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు(MLC Shambhipur Raju) చేసిన వాఖ్యలను బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఖండించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మల్లారెడ్డి ఆస్పత్రిపై కేసు నమోదు


గత పదేళ్లుగా రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన ఘనత బీఆర్‌ఎస్‌ పార్టీదేనని, ఆ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక 50 వేల ఉద్యోగాలు ఇచ్చారని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని, కేసీఆర్‌ మాత్రం ఫామ్‌హౌస్ కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.


city8.2.jpg

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి అధికారం ఇచ్చారని, తాము వారి కోసం మాత్రమే పనిచేస్తామన్నారు. అధికారం పోయిందనే అక్కసుతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. గత పదేళ్లుగా శంభీపూర్‌ రాజు చేసిన సెటిల్మెంట్లు, కబ్జాలు అన్ని బయటికి తీసే రోజు దగ్గరలోనే ఉందని చిరుమర్తి రాజు అన్నారు.


ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ క్యాడర్‌ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడిగా రాంరెడ్డి

ఈవార్తను కూడా చదవండి: Midday Meal: మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌

ఈవార్తను కూడా చదవండి: TET: ముగిసిన టెట్‌ గడువు..22 వరకు ఎడిట్‌ ఆప్షన్‌

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ పర్యటన.. రోడ్డెక్కిన దళిత సంఘాల నాయకులు..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 21 , 2024 | 10:46 AM