Share News

Education: బైపీసీ చేయని వారూ ఇప్పుడు డాక్టర్‌ కావచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన ఎన్ఎంసీ

ABN , First Publish Date - 2023-11-25T09:28:11+05:30 IST

నేషనల్ మెడికల్ కమిషన్(NMC) తాజా గైడ్ లైన్స్ డాక్టర్ కావాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు.

Education: బైపీసీ చేయని వారూ ఇప్పుడు డాక్టర్‌ కావచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన ఎన్ఎంసీ

ఢిల్లీ: డాక్టర్‌(Doctor)గా కెరీర్ లో సెటిల్ కావాలనేది చాలా మంది కల. అధిక ఖర్చు కారణంగా చాలా మంది తమ కలను నెరవేర్చుకోలేక.. ఇంటర్‌(Intermediate)లో వేర్వేరు గ్రూపులు తీసుకుంటారు. అయితే నేషనల్ మెడికల్ కమిషన్(NMC) విడుదల చేసిన తాజా గైడ్ లైన్స్ డాక్టర్ కావాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు.

ఎంపీసీ(MPC)ను కోర్ సబ్జెక్టుగా తీసుకుని 10 + 2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు డాక్టర్ గా మారవచ్చు. ఎలాగంటారా? ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 + 2 స్థాయిలో జీవశాస్త్రం/బయోటెక్నాలజీని అదనపు సబ్జెక్టుగా తీసుకుని పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే వారు చేయాల్సింది


కెమిస్ట్రీ, బయాలజీ / బయో టెక్నాలజీ ఇంగ్లీషుతో పాటు, ఇంటర్ పాసైన తరువాత అదనపు సబ్జెక్టులు రాసి నీట్-యూజీ పరీక్షలు రాసేందుకు అర్హత సాధించవచ్చు. ఆ అభ్యర్థులకు ఎన్ఎంసీ అర్హత సర్టిఫికేట్ కూడా మంజూరు చేస్తుంది. ఎన్ఎంసీ మంజూరు చేసిన ధ్రువపత్రం సదరు విద్యార్థి విదేశాల్లో సైతం అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులను అభ్యసించడానికి అర్హుల్ని చేస్తుంది.

ఇదివరకు ఒక విద్యార్థి ఎంబీబీఎస్(MBBS) లేదా బీడీఎస్(BDS) అభ్యసించే అర్హత పొందేందుకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ తో పాటు ఇంటర్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్ / బయో టెక్నాలజీ రెండు సంవత్సరాలపాటు చదివి ఉండాలి. కాలేజ్ నుంచి రెగ్యులర్ విధానంలో దీనిని పూర్తి చేయాల్సి ఉంటుంది.

బయాలజీ / బయోటెక్నాలజీ లేదా ఏదైనా ఇతర సబ్జెక్ట్ ని 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తరువాత అదనపు సబ్జెక్ట్ గా పూర్తి చేయడం సాధ్యం కాదని పాత నిబంధనల్లో ఉన్నాయి. ఎన్ఎంసీ తాజా నిబంధనలు వీటిని మార్చింది. దీంతో ఇంటర్ లో జీవశాస్త్రం / బయో టెక్నాలజీ ప్రధాన సబ్జెక్టుగా కలిగి ఉండకపోయినా, వైద్య విద్య చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ కల నెరవేరనుంది.

Updated Date - 2023-11-25T09:32:04+05:30 IST