Pallavi Joshi: కశ్మీర్ ఫైల్స్‌ డైరక్టర్ వివేక్ అగ్నిహోత్రి భార్య పల్లవి జోషికి గాయాలు

ABN , First Publish Date - 2023-01-16T20:11:26+05:30 IST

బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి భార్య పల్లవి జోషి గాయపడ్డారు.

Pallavi Joshi: కశ్మీర్ ఫైల్స్‌ డైరక్టర్ వివేక్ అగ్నిహోత్రి భార్య పల్లవి జోషికి గాయాలు
Pallavi Joshi Injured

హైదరాబాద్: బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి భార్య పల్లవి జోషి గాయపడ్డారు. ది వ్యాక్సిన్ వార్ సినిమా షూటింగ్ సమయంలో కార్ చేజింగ్ సీన్‌లో ఆమెకు గాయాలయ్యాయి. అయినా కూడా ఆమె గాయాలతోటే షూటింగ్ పూర్తి చేసుకున్నారని సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ తెలిపారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ది వ్యాక్సిన్ వార్ సినిమాకు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన దర్శకత్వంలోనే వచ్చిన కశ్మీర్ ఫైల్స్‌లోనూ పల్లవి జోషి నటించారు.

కాంతారా సినిమాలో హీరోయిన్‌గా నటించిన సప్తమి గౌడ కూడా ది వ్యాక్సిన్ వార్‌లో నటించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు అగ్నిహోత్రి ఇటీవలే వెల్లడించారు.

Updated Date - 2023-01-16T20:26:46+05:30 IST