Share News

Uttarkashi Tunnel: టన్నెల్ లోపల కార్మికులు ఎలా గడిపారు.. వైరల్ అవుతున్న ఫోటోలు

ABN , First Publish Date - 2023-12-01T15:43:07+05:30 IST

ఉత్తరకాశీ టన్నెల వ్యవహారం సుఖాంతం అయ్యింది. అనుకోని కారణాల వల్ల సొరంగం కూలిపోవడంతో లోపలే చిక్కుకున్న 41 మంది కార్మికులు ఎట్టకేలకు 17 రోజుల తర్వాత సురక్షితంగా బయటపడ్డారు. అయితే.. ఇన్ని రోజుల పాటు వాళ్లు లోపల ఎలా గడిపారు?

Uttarkashi Tunnel: టన్నెల్ లోపల కార్మికులు ఎలా గడిపారు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Uttarkashi Tunnel Rescue Operation: ఉత్తరకాశీ టన్నెల వ్యవహారం సుఖాంతం అయ్యింది. అనుకోని కారణాల వల్ల సొరంగం కూలిపోవడంతో లోపలే చిక్కుకున్న 41 మంది కార్మికులు ఎట్టకేలకు 17 రోజుల తర్వాత సురక్షితంగా బయటపడ్డారు. అయితే.. ఇన్ని రోజుల పాటు వాళ్లు లోపల ఎలా గడిపారు? వారి పరిస్థితి ఏంటి? అనేది బయటకొచ్చేదాకా ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు. ఇప్పుడు ఈ ఆసక్తికరమైన విషయాలను అంకిత్ అనే ఒక కార్మికుడు మీడియాతో పంచుకున్నాడు. తాము చిన్ననాటి ఆటలు ఆడటంతో పాటు అటూఇటూ తిరుగుతూ టన్నెల్ లోపల కాలక్షేపం చేశామని తెలిపాడు.


ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లాలోని మోతీపూర్ నివాసి అయిన అంకిత్.. సొరంగం లోపల తాము గడిపిన ఆ 17 రోజులు చావు అంచులదాకా వెళ్లి వచ్చినట్టు అనిపించిందని అన్నాడు. లోపలున్నంత కాలం తాను కుటుంబం గురించే ఆందోళన చెందానని పేర్కొన్నాడు. సొరంగం చాలా పొడవుగా ఉన్నందున.. తాము సమయం గడపడానికి మరింత లోపలికి నడిచామన్నాడు. రాజా, మంత్రి, చోర్, సిపాహి వంటి చిన్ననాటి ఆటలను కూడా ఆడామన్నాడు. అంతేకాదు.. తమ వద్ద ఉన్న పెన్, డైరీని ఉపయోగించి కార్డ్ గేమ్ కూడా సిద్ధం చేశామన్నాడు. టన్నెల్ లోపల చలి అంతగా లేదని.. నిద్రపోయేటప్పుడు జియోటెక్స్టైల్స్‌ను దుప్పట్లుగా ఉపయోగించామని వెల్లడించాడు. ఇదే సమయంలో తన ఫోన్‌లో తీసిన ఫోటోలు, వీడియోలను సైతం అంకిత్ షేర్ చేశాడు.

ఇదిలావుండగా.. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా ఈ 4.5 కిలోమీటర్ల టన్నెల్‌ను నిర్మిస్తున్నారు. ఇది ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా, దండల్‌గావ్‌లను కలిపే మార్గంలో ఉంది. నవంబర్ 12వ తేదీన సొరంగంలో ఒక భాగం అనుకోకుండా కుప్పకూలిపోవడంతో.. 41 మంది కార్మికులు లోపలే చిక్కుకున్నారు. వారికి బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కున్నాయి. చివరకు ‘ర్యాట్ హోల్ మైనింగ్’ టెక్నిక్‌తో ఈ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం అయ్యింది. ఈ టెక్నిక్‌తో వేగంగా కార్మికుల్ని చేరుకొని.. లోపలి వరకు పైపింగ్ వేసి.. స్ట్రెచర్ ద్వారా కార్మికులను బయటకు తీసుకురావడం జరిగింది.

Uttarkashi-Tunnel3.jpg

Uttarkashi-Tunnel2.jpg

Uttarkashi-Tunnel1.jpg

Updated Date - 2023-12-01T15:43:09+05:30 IST