Share News

కార్న్‌ కట్‌లెట్‌

ABN , First Publish Date - 2023-11-28T04:06:09+05:30 IST

కార్న్‌ ఉడికించి పెట్టుకోవాలి.

కార్న్‌ కట్‌లెట్‌

కావలసిన పదార్థాలు: బంగాళాదుంపలు - 2, స్వీట్‌ కార్న్‌ - 3/4 కప్పు, పచ్చిమిర్చి - 1, కొత్తిమీర తరుగు - 2 టీస్పూన్లు, కారం - అర టీస్పూను

గరం మసాలా - అర టీస్పూను

అల్లం పేస్ట్‌ - అర టీస్పూను

ఉప్పు - తగినంత, చాట్‌ మసాలా - చిటికెడు

బ్రెడ్‌ పొడి లేదా పోహా పొడి - పావు కప్పు

నూనె - 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ విధానం: కార్న్‌ ఉడికించి పెట్టుకోవాలి.

బంగాళాదుంపలు ఉడికించి ముద్ద చేయాలి.

నూనె మినహా అన్ని దినుసులను ఈ ముద్దలో కలుపుకోవాలి.

బాగా కలిపి సమ భాగాలుగా విడదీసుకోవాలి.

వాటిని చదునుగా చేసుకుని పెనం మీద నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.

వేడిగా కెచప్‌ లేదా పుదీనా చట్నీతో తినాలి.

Updated Date - 2023-11-28T04:06:23+05:30 IST