Share News

Dory : డబుల్‌ ఎట్రాక్షన్‌ ‘డోరి’!

ABN , First Publish Date - 2023-11-28T23:50:10+05:30 IST

లెహెంగా, బ్లౌజ్‌, చురీదార్‌... డ్రస్‌ ఏదైనా దానికి కొత్త ఆకర్షణ తెచ్చిపెట్టాలంటే ‘డోరి’ తగిలించాలి. రెడీమేడ్‌ డోరి లేదా సృజనాత్మకత జోడించి తయారుచేసిన డోరి...

Dory : డబుల్‌ ఎట్రాక్షన్‌ ‘డోరి’!

లెహెంగా, బ్లౌజ్‌, చురీదార్‌... డ్రస్‌ ఏదైనా దానికి కొత్త ఆకర్షణ తెచ్చిపెట్టాలంటే ‘డోరి’ తగిలించాలి. రెడీమేడ్‌ డోరి లేదా సృజనాత్మకత జోడించి తయారుచేసిన డోరి... మీ దుస్తులకు, మీకు ప్రత్యేక అందాన్ని జోడిస్తుంది. ఇందుకోసం...

పర్సనలైజ్‌డ్‌: పేర్లు, చిన్న చిన్న ఫన్నీ కోట్స్‌... ఎంబ్రాయిడరీ చేయించిన చిట్టి పొట్టి లట్‌కాన్‌లను లెహెంగాలకు వేలాడదీసుకోవచ్చు. దీర్ఘచతురస్రాకారంలో కుట్టించిన లట్‌కాన్‌ల మీద అక్షరాలు రాసుకుని, ఎంబ్రాయిడరీ చేయిస్తే మీదైన స్టయిల్‌తో అదరగొట్టేయవచ్చు.

స్కాలప్స్‌: పువ్వుల ఆకారంలోని స్కాలప్స్‌ పెళ్లి వేడుకల్లో ధరించడానికి బాగుంటాయి. గోల్డెన్‌ బీడ్‌లు, స్కాలప్స్‌ పూస గుచ్చినట్టు అల్లి, లెహెంగాకు వేలాడదీయాలి. లెహెంగాకు హెవీ లుక్‌ తెప్పించాలంటే ఇలాంటి స్కాలప్స్‌ ఎంచుకోవాలి.

పామ్‌ పామ్‌: మెత్తని కుచ్చులైన పామ్‌ పామ్‌లను ఇయర్‌ హ్యాంగింగ్స్‌గానే కాదు, డోరీలుగా కూడా వాడవచ్చు. ఈ గులాబీ, ఆకుపచ్చ, మెరూన్‌ కలర్‌ బాంబ్స్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి.

మిర్రర్‌ మిర్రర్‌: అద్దాలు ఎక్కడున్నా తళుకులీనుతూ అందరి కళ్లనూ కట్టిపడేస్తాయి. కాబట్టి వీటిని లట్‌కాన్‌లుగా కూడా వాడవచ్చు. త్రెడ్‌ వర్క్‌ డిజైన్‌ మధ్యలో అద్దాలను ఉంచి లట్‌కాన్‌లను తయారు చేసుకోవచ్చు. వీటిని లెహెంగా లేదా బ్లౌజ్‌లకు తగిలించుకోవచ్చు.

Updated Date - 2023-11-28T23:50:11+05:30 IST