Share News

Sleeping: రాత్రిళ్లు పదే పదే మెలకువ వస్తోందా..? ఈ 4 వ్యాధులే అసలు కారణం కావచ్చు..!

ABN , First Publish Date - 2023-11-28T16:08:38+05:30 IST

నిద్రపోతున్నప్పుడు కాళ్లలో నొప్పి, తిమ్మిరి ఉంటాయి. దీనితో నిద్ర కూడా చెడిపోతుంది.

Sleeping: రాత్రిళ్లు పదే పదే మెలకువ వస్తోందా..? ఈ 4 వ్యాధులే అసలు కారణం కావచ్చు..!
sleep problem

మంచి ఆహారం అలవాట్లతో మంచి నిద్ర కూడా చాలా అవసరం. ఆరోగ్యాన్ని సరైన పద్దతిలో కాపాడుకోవాలంటే దానికి ఆహారంతో పాటు నిద్ర కూడా అంతే అవసరం. సరిగా నిద్రలేకపోవడం అనేది శరీరంలో అనేక వ్యాధులకు కారణం అవుతుంది. నిద్ర నాణ్యత బావుంటే అది రోగనిరోధక వ్యవస్థను అలాగే గ్రెలిన్, లెఫ్టిన్ హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒక వ్యక్తికి పూర్తి ఆరోగ్యవంతులకు 8 గంటల నిద్ర చాలా అవసరం.

మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. నిద్ర మెదడుకు, శరీర దెబ్బతిన్న కణజాలాలను నయం చేయడానికి సహాయపడుతుంది. అంటే శరీరానికి, మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. నిద్ర అవసరాలు వ్యక్తి వయస్సు, జీవనశైలిని, ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటాయి. మామూలుగా ఒకవ్యక్తికి 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం అవుతుంది.

నిద్ర లేకపోవడం లేదా నిద్ర రుగ్మత కారణంగా.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..సరైన నిద్ర లేకపోతే చాలా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. నిద్ర సమస్యతో కనుక బాధపడుతుంటే మాత్రం ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి.

1. అధిక నిద్రపోవడం

2. తలనొప్పి

3. ఏకాగ్రత లేకపోవడం

4. బలహీనమైన అనుభూతి

5. చిరాకు

6. తరచుగా నిద్రకు భంగం కలగడం


ఇది కూడా చదవండి: బొప్పాయి పండును తిన్న తర్వాత.. ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు.. పొరపాటున వీటిని తింటే..!

స్లీప్ అప్నీయా

తీవ్రమైన స్లీప్ డిజార్డర్, దీనిలో శ్వాస తరచుగా కొన్ని సెకన్ల పాటు ఆగి మళ్ళీ ప్రారంభమవుతుంది. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది. దీని వల్ల మెదడుకు మిగిలిన శరీరానికి ఆక్సిజన్ సరఫరా సరిగా అందకపోవచ్చు.

రెస్ట్ లెస్ లెగ్స్ సిండ్రోమ్..

ఈ వ్యాధి నాడీ సంబంధిత రుగ్మత. ఇందులో వ్యక్తి తన కాళ్లను అస్తమానూ కదిలిస్తూ ఉంటాడు. ఇది నిద్రిస్తున్నప్పుడు కూడా జరుగుతుంది. నిద్రపోతున్నప్పుడు కాళ్లలో నొప్పి, తిమ్మిరి ఉంటాయి. దీనితో నిద్ర కూడా చెడిపోతుంది.


ఎక్కువ ఒత్తిడి..

ఒత్తిడి, ఆందోళనలో ఉన్నప్పుడు అది మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే, అది శారీరక,మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఒత్తిడి నిద్ర సమస్యలను కలిగిస్తుంది.

నిద్రలేమి..

నిద్రలేమి అనేది సాధారణ రకమైన నిద్రరుగ్మత. సరైన జీవన శైలి అలవాట్లతో నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చు.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-28T16:08:39+05:30 IST