Share News

Papaya: బొప్పాయి పండును తిన్న తర్వాత.. ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు.. పొరపాటున వీటిని తింటే..!

ABN , First Publish Date - 2023-11-28T13:33:09+05:30 IST

బొప్పాయి తిన్నాకా, నిమ్మకాయను తీసుకోకూడదు. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పాడు చేస్తుంది. రక్తహీనత ప్రమాదం కూడా పెరుగుతుంది.

Papaya: బొప్పాయి పండును తిన్న తర్వాత.. ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు.. పొరపాటున వీటిని తింటే..!
eating this fruit

ఆరోగ్యాన్ని కాపాడేందుకు మనం తీసుకునే ఆహరం చాలా వరకూ సపోర్ట్ గా నిలుస్తుంది. తాజా కూరలు, పండ్లు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యపరమైన ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. మనం రోజువారీ తీసుకునే పండ్లలో బొబ్బాయిని తీసుకుంటూ ఉంటారు. ఇది ఆరోగ్యాన్ని పెంచడంలో సహకరిస్తుంది. అయితే ఆరోగ్యాన్ని కోసం బొప్పాయి పండు తీసుకున్నా, తర్వాత చాలా మంది తెలియక చేసే మిస్టేక్స్ ఏంటంటే..

బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మెరుగ్గా ఉంచడంలోనూ, పొట్ట ఆరోగ్యాన్ని కాపాడటంలోను ముందుంటుంది. ఈ పండును చల్లని, వేసవిలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. బొప్పాయి తిన్నాకా ఏం తినకూడదో చూద్దాం.

1. బొప్పాయి తిన్నాకా, నిమ్మకాయను తీసుకోకూడదు. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పాడు చేస్తుంది. రక్తహీనత ప్రమాదం కూడా పెరుగుతుంది.

2. బొప్పాయి తిన్న వెంటనే పెరుగు తీసుకోకూడదు. ఇవి రెండూ కలిపి తీసుకుంటే కడుపులో నొప్పి మొదలవుతుంది. దీంతో అనారోగ్యం పాలవుతారు.

ఇది కూడా చదండి: చేపలతో కలిపి పొరపాటున కూడా తినకూడని 6 ఆహార పదార్థాల లిస్ట్ ఇదీ.. తింటే ఏమౌతుందంటే..!


3. బొప్పాయి తిన్నకా టమోటాను కూడా తినకపోవడం మంచిది. ఇది గానీ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అలాగే బొప్పాయితో కివీ పండ్లను కూడా కలిపి తినకూడదు. ఇది ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అలాగే ఆరెంజ్ పండు కూడా బొప్పాయితో కలిపి తినకూడదు.

ఇది కడుపునొ ప్పి వచ్చేలా చేస్తుంది. జీర్ణసమస్యలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చే పండ్లో అయినా వాటితో మనం తినకూడని పదార్థాలు ఏమిటో తెలుసుకుని అవి కలవకుండా చూసుకోవడం మంచిది.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-28T13:35:57+05:30 IST