Share News

Milk: ఏడాది లోపు వయసున్న పిల్లలకు జంతువుల పాలు అస్సలు వద్దు.. ఈ డాక్టర్ చెబుతున్న 5 కారణాలు వింటే..!

ABN , First Publish Date - 2023-11-28T15:34:05+05:30 IST

ఆవు, గెదె పాలను నవజాత శిశువుకు పట్టించడం వల్ల రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని చర్మం, జీర్ణ, శ్వాసకోశ, అవయవ వ్యవస్థలను మరింత ప్రభావితం చేస్తుంది.

 Milk: ఏడాది లోపు వయసున్న పిల్లలకు జంతువుల పాలు అస్సలు వద్దు.. ఈ డాక్టర్ చెబుతున్న 5 కారణాలు వింటే..!
newborn baby

పిల్లలకు పాలు పెట్టే విధానంలో వారికి ఇచ్చే ఆహారం విషయంలో తల్లిదండ్రులు కాస్త శ్రద్ధగానే ఉంటారు. అయితే బిడ్డకు ఇచ్చే పాలలో ఎలాంటి పోషకాలు ఉండాలి. అంటే అవి తల్లిపాలతో సమం కాకపోయినా కాస్తన్నా బిడ్డ ఆరోగ్యానికి సపోర్ట్ ఇచ్చేవిగా ఉండాలి. అలా ఆలోచించినపుడు ఆవు, గెదె, మేక వంటి జంతువుల పాలు బిడ్డకు సరైన పోషణను అందిస్తాయని భావించి ఎంచుకుంటాం. అయితే ఈ పాలు పసి పిల్లలకు ఎంతవరకూ మేలు చేస్తాయి. అసలు జంతువుల నుంచి సేకరించిన పాలను పిల్లలకు పట్టచ్చా.. దీనిమీద వైద్యులు ఏమంటున్నారు. ఇవే విషయాలను తెలుసుకుందాం.

ఈ పాలలో అనేక పోషకాలున్నా కూడా పిల్లలకు జంతువుల పాలను ఇవ్వద్దు అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా నవజాత శిశువులకు జంతువుల పాలను ఎందుకు ఇవ్వకూడదు.

ఆవుపాలు పిల్లలకు ఎందుకు హానికరం అంటే..

అధిక కాంప్లెక్స్ ప్రోటీన్ కారణం..

ఈ పాలలో పెద్ద మొత్తంలో సంక్లిష్ట ప్రోటీన్లు ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్ ఆవు దూడ పుట్టగానే ఆవు దూడ నిలబడడానికి, నడవడానికి కారణం అవుతాయి. అయితే ఆవు ఇతర పాలను తాగిన నవజాత శిశువు మూత్రపిండాలపై ఈ ప్రోటీన్ చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ ఆహారాన్ని పిల్లల పేగులు కూడా సరిగా జీర్ణం చేసుకోలేవు. కిడ్నీలకు కూడా హాని ఉంటుంది. కొన్నిసార్లు డయేరియాతోపాటు, మలంలో రక్తం కూడా కనిపిస్తుంది.

తక్కువ ఇనుము..

ఆవు ఇతర జంతువుల పాలు ఎంత ఆరోగ్యకరం అయినా సరే అందులోని ఐరెన్, విటమిన్ సి, పోషకాలు పెద్దగా లేవు. అప్పుడే పుట్టిన బిడ్డలకు ఆవుపాలను ఇవ్వడం వల్ల ఐరెన్ లోపం ఏర్పడుతుంది. పిల్లలు చికాకుగా ఉంటారు. బరువు కూడా పెద్దగా పెరిగే అవకాశం ఉండదు. ఈ పాలలో ప్రోటీన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండి ఇవి నవజాత శిశువు సరిగా ఎదగని మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తాయి. వేడి ఒత్తిడి, జ్వరం, విరేచనాలను కలిగిస్తాయి.

ఇది కూడా చదవండి: బొప్పాయి పండును తిన్న తర్వాత.. ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు.. పొరపాటున వీటిని తింటే..!

విటమిన్ సి లోపం..

అంతే కాకుండా జంతువుల పాలలో విటమిన్ సి కూడా తక్కువగా ఉంటుంది. వైద్య నివేదికల ప్రకారం దాదాపు మూడు శాతం మంది పిల్లలు జంతువుల పాల ప్రోటీన్ తట్టుకోలేరు. ఇవి తల్లిపాలంత స్వచ్ఛతను బిడ్డకు అందివ్వలేవు.


ఏడాది దాటాకా..

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఆవుపాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కానీ ఆరు నుంచి 24 నెలల మధ్య పిల్లల్లో 10 శాతం పిల్లల్లో మాత్రమే దీనిని పూర్తి ఆరోగ్యకరమైన ఆహారంగా తీసుకోగలరు. ప్రపంచ వ్యాప్తంగా అలెర్జీ వ్యాధులు పెరుగుతున్నాయి. పిల్లల్లో పాలతో వచ్చే అలెర్జీలు ఎక్కువగా ఉన్నాయి.

ఆవు, గెదె పాలను నవజాత శిశువుకు పట్టించడం వల్ల రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని చర్మం, జీర్ణ, శ్వాసకోశ, అవయవ వ్యవస్థలను మరింత ప్రభావితం చేస్తుంది. చర్మంపై దద్దుర్లు, తామర, వాంతులు, విరేచనాలు, కోలిక్, గరుక, విపరీతమైన ఏడుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు పట్టే పాల విషయంలో తల్లిదండ్రులు వైద్యుల సలహా మీద పట్టించడం అన్ని విధాలా మంచిది.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-28T15:34:07+05:30 IST