Share News

Health Tips: రోజూ అసలు పొద్దున్నే అసలు ఎందుకు నిద్ర లేవాలి..? ఆలస్యంగా లేవడం వల్ల 10 లాభాలు మిస్..!

ABN , First Publish Date - 2023-11-25T15:50:20+05:30 IST

ఉదయాన్నే జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటి శరీరక పనులు చేయడం వల్ల తక్కువ కాలుష్య వాతావరణాన్ని అందిస్తాయి.

Health Tips: రోజూ అసలు పొద్దున్నే అసలు ఎందుకు నిద్ర లేవాలి..? ఆలస్యంగా లేవడం వల్ల 10 లాభాలు మిస్..!
health benefits

ఉదయాన్నే నిద్రలేవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చనే మాట ఇప్పటిది అయితే కాదు. పూర్వకాలం నుంచి మన పెద్దలు చెబుతున్నమాటే. ఉదయాన్నే లేవడం స్నానాదులు కానిచ్చి, కాస్త త్వరగా నిద్ర లేవడం అంటే నిద్ర షెడ్యుల్ ను సరైన పద్దతిలో ఏర్పడేలా చేస్తుంది. ఇది మెరుగైన నిద్ర నాణ్యతను పెంచుతుంది. అయితే సరైన నిద్ర వేళలు మనకు ఎందుకు అవసరం అనే విషయాన్ని తెలుసుకుందాం.

నిద్ర వేళలు సరిగా ఉన్నప్పుడు కలిగే ప్రయోజనాలు...

చాలామంది వ్యక్తులు ఉదయాన్నే లేవడం వల్ల కాస్త త్వరగా పనులు అవుతాయి. అలాగే రోజంతా తాజాగా ఉంటారు. చేసే పనుల్లో ఒత్తిడి లేకుండా ఉంటుంది. అలాగే రోజులో చాలా సమయం ఉన్నట్టు కనిపిస్తుంది.

1. దానితో పాటు శరీరానికి తగిన వ్యాయామాన్ని అందించవచ్చు. ఇది శ్రమచేయగలిగే శక్తిని శరీరానికి ఇస్తుంది.

2. రోజును ముందుగానే మొదలుపెట్టినట్టు అనిపిస్తుంది. దీనితో పాటు ధ్యానం, వ్యాయామం వంటి చేసే వీలు, సమయం ఉంటాయి. దీనితో మొత్తం మానసిక స్థితి మెరుగుపడుతుంది.

3. ఉదయాన్నే లేవడం వల్ల వ్యాయామం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది బరువును పెరగకుండా చేస్తుంది. అలాగే కండరాలను బలంగా మారుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.

ఇది కూడా చదవండి: చైనాలో అసలేం జరుగుతోంది..? రంగంలోకి దిగిన డబ్ల్యూహెచ్‌వో.. పిల్లల్లో వింత నిమోనియాకు కారణమేంటి..?


4. త్వరగా మేల్కొవడం అంటే త్వరగా నిద్రకు ఉపక్రమించాలి. ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది. మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుంది.

5. ఉదయం పోషకాలున్న అల్పాహారాన్ని తీసుకోవడం వల్ల రోజంతా ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకోవాలి. ఇది మెరుగైన ఆరోగ్యంతో పాటు బరువును కూడా సమంగా ఉండేలా చేస్తుంది.

6. తొందరగా మేల్కోవడం వల్ల ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడానికి సమయం ఉంటుంది. రోజంతా ఏకాగ్రత పెరుగుతుంది. మరిచిపోవడం అనే సమస్య ఉండదు.

7. త్వరగా నిద్రలేవడం అనేది శరీరకంగా, మానసికంగా ఒత్తిడిని తగ్గిస్తుంది.

8. ఉదయాన్నే జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటి శరీరక పనులు చేయడం వల్ల తక్కువ కాలుష్య వాతావరణాన్ని అందిస్తాయి. కార్డియోవాల్కులర్ హెల్త్, స్టామినా పెరుగుతుంది.

9. రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.

పొద్దున్నే లేచి సూర్యరశ్శికి గురికావడం వల్ల శరీరం విటమిన్ డి ఉత్పత్తి పెంచడంలో సహాయపడుతుంది.

10. ఆరోగ్యం పెరుగుతుంది.

శరీరక, మానసిన ఆరోగ్యం సానుకూలంగా మారుతుంది.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యుస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-25T15:50:21+05:30 IST