Share News

మహిళలూ... మీకు తెలుసా?

ABN , First Publish Date - 2023-11-28T04:08:47+05:30 IST

గుప్త ప్రదేశంలో వాసన పోగొట్టాలని డియోడరెంట్లు వాడటం, పదే పదే సబ్బు రుద్ది కడగటం చేస్తున్నారా? ఇలా చేయటం వల్ల ఆ సున్నితమైన ప్రదేశం పొడిగా మారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారవుతుంది.

మహిళలూ... మీకు తెలుసా?

ఆ వాసన సహజం: గుప్త ప్రదేశంలో వాసన పోగొట్టాలని డియోడరెంట్లు వాడటం, పదే పదే సబ్బు రుద్ది కడగటం చేస్తున్నారా? ఇలా చేయటం వల్ల ఆ సున్నితమైన ప్రదేశం పొడిగా మారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారవుతుంది. మర్మాంగం తనంతట తాను శుభ్రం చేసుకోగల అద్భుతమైన అవయవం. మరీ భరించలేనంత దుర్వాసన వెలువడుతుంటే ఇన్‌ఫెక్షన్‌గా భావించి వైద్యుల్ని కలవాలే తప్ప సొంతంగా వాసన పోగొట్టే ప్రయత్నాలు చేయకూడదు.

ఆ కోరిక తగ్గిందా?: గర్భనిరోధక మాత్రల ప్రభావం పరోక్షంగా లైంగిక శక్తి మీద పడుతుంది. ఈ మాత్రలు హార్మోన్ల అసమతౌల్యాన్ని కలిగించి సెక్స్‌ హోర్మోన్‌ ఉధృతి మందగించేలా చేస్తాయి. దాంతో లైంగిక కోరికలు తగ్గుతాయి. అందర్లోనూ ఇలా జరగకపోయినా, గర్భనిరోధక మాత్రలతో మీ సెక్స్‌ డ్రైవ్‌ తగ్గినట్టు అనిపిస్తే వైద్యుల్ని సంప్రదించి కాపర్‌ టి లాంటి ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి.

మోర్‌ సెక్స్‌: ప్రీ మెనోపాజ్‌ (30-35 ఏళ్లు)లో యోని గోడలు పలుచనవడం, పొడిగా మారటంతో మొదలయ్యే ‘అట్రోఫిక్‌ వెజినైటిస్‌’ మెనోపాజ్‌ (45-50 ఏళ్లు)కు చేరుకునేసరికి మరింత ముదిరి సెక్స్‌ తృప్తిని దూరం చేస్తుంది. మెనోపాజ్‌లో అండాశయాలు ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉత్పత్తి చేయటం మానేస్తాయి. ఫలితంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఇబ్బందిని అధిగమించటం కోసం లూబ్రికెంట్స్‌, ఈస్ట్రోజన్‌ క్రీమ్‌ లేదా మాత్రలు వాడాలి. ఇవన్నీ వద్దనుకుంటే తరచుగా సెక్స్‌లో పాల్గొనాలి. రెగ్యులర్‌ సెక్స్‌ వల్ల యోని సాగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది.

ఒత్తిడి వద్దు: ఒత్తిడికి లోనైనప్పుడు కార్టిసాల్‌ అనే హార్మోన్‌ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది లైంగిక కోరికను కుంటు పరుస్తుంది. దాంతో ఒత్తిడికి కారణమైన కార్టిసాల్‌తో పోరాడే ఎండార్ఫిన్లు మన శరీరంలో విడుదలవుతాయి. అయితే ఇవి

తగినంత రిలీజ్‌ అవాలంటే వ్యాయామం చేయాలి. కాబట్టి ప్రతిరోజూ కనీసం గంట పాటు వ్యాయామం చేయాలి. ఎండార్ఫిన్లు అనే ఫీల్‌ గుడ్‌ హార్మోన్లు వల్ల ఒత్తిడి తొలగడంతోపాటు హుషారుగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా తయారవుతాం.

Updated Date - 2023-11-28T04:09:02+05:30 IST