Share News

US Student Visa Rules: అమెరికా స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేసుకునే వారికో అలర్ట్..!

ABN , First Publish Date - 2023-11-27T19:58:27+05:30 IST

స్టూడెంట్ వీసా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి అమెరికా రాయబార కార్యాలయం కొత్త నిబంధనలు ప్రకటించింది.

US Student Visa Rules: అమెరికా స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేసుకునే వారికో అలర్ట్..!

ఎన్నారై డెస్క్: పైచదువులకు అమెరికా వెళదామనుకుంటున్నారా? వీసాకు( US Student Visas) దరఖాస్తు చేసుకునే పనిలో ఉన్నారా? అయితే మీకో అలర్ట్! వీసా దరఖాస్తుకు సంబంధించి అమెరికా ఎంబసీ(American Embassy) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఎఫ్, ఎమ్, జే వీసాలకు ఇవి వర్తిస్తాయని పేర్కొంది. వీసా దరఖాస్తుల్లో మోసాలు, అపాయింట్‌మెంట్ దుర్వినియోగానికి బ్రేకులు వేసేందుకు నిబంధనల్లో మార్పులు చేసినట్టు వెల్లడించింది(New US Visa Rules).

Viral: చికెన్ శాండ్‌విచ్‌తో ఫ్లైట్ ఎక్కిన మహిళ..విమానంలో కునుకు తీయడంతో జరిగిందో దారుణం!


కొత్త నిబంధనలు ఏంటంటే..

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు సొంత పాస్‌పోర్టు నెంబర్‌నే వినియోగించాలి. తప్పుడు నెంబర్లు ఉన్న దరఖాస్తులను తిరస్కరిస్తారు. అపాయిమెంట్లను కూడా రద్దు చేసే అవకాశం ఉంది. అభ్యర్థులు వీసా ఫీజులు కూడా కోల్పోవాల్సి రావచ్చు.

తప్పుడు పాస్‌పోర్టు నెంబర్‌తో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న వారు సరైన నెంబర్‌తో మళ్లీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తరువాత అపాయింట్‌మెంట్ తేదీ బుక్ చేసుకోవాలి. దీనికి ఫీజులు కూడా చెల్లించాలి.

Indian Railway: చేతిలో ట్రైన్ టికెట్ ఉన్నా సరే.. ఈ మిస్టేక్ చేస్తే జరిమానా తప్పదు.. చాలా మందికి తెలియని రూల్..!

పాస్‌పోర్టు పోగొట్టుకున్నా, చోరీ అయినా లేదా రెన్యూ చేసుకున్నా.. దరఖాస్తు సమయంలో పాత పాస్‌పోర్టుల ఫొటోకాపీ లేదా ఇతర డాక్యుమెంట్లు అందించాలి. అపాయింట్‌మెంట్ ప్రక్రియ సులభతరం అయ్యేందుకు ఇది కీలకం.

ఎఫ్, ఎమ్ వీసాల దరఖాస్తుదారులు తప్పనిసరిగా స్టూడెంట్ ఎక్సేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ ధ్రువీకరించిన విద్యాసంస్థ లేదా ప్రోగ్రామ్‌లో తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. జే వీసా దరఖాస్తుదారులు అమెరికా విదేశాంగ శాఖ అనుమతి ఉన్న సంస్థ నుంచి స్పాన్సర్‌షిప్ పొందాలి.

ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని దరఖాస్తు చేసుకోవాలని అమెరికా రాయబార కార్యాలయం అభ్యర్థులకు సూచించింది.

Viral: విసిగిపోయిన భారతీయ రెస్టారెంట్.. బ్రిటన్ ప్రజలకు ఊహించని వార్నింగ్!

Updated Date - 2023-11-27T19:58:31+05:30 IST