USA Box Office: అమెరికా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'వాల్తేరు వీరయ్య'.. చిరు ఖాతాలో మరో రికార్డు
ABN , First Publish Date - 2023-01-22T13:38:14+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), యంగ్ డైరెక్టర్ బాబీ కాంబోలో ఈ సంక్రాంతికి వచ్చిన 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) సూపర్ హిట్ అయింది.
ఓవర్సీస్ సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), యంగ్ డైరెక్టర్ బాబీ కాంబోలో ఈ సంక్రాంతికి వచ్చిన 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) సూపర్ హిట్ అయింది. దాంతో బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే రూ.100కోట్ల (గ్రాస్) మార్క్‌ను అందుకుని, విడుదలైన ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.89కోట్లు సాధించాల్సి ఉండగా.. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అందుకుని రూ. 12కోట్లకు పైగా లాభాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అటు యూఎస్ బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేస్తోంది. తాజాగా 2మిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది.
ఈ మేరకు ఈ సినిమాను అమెరికాలో విడుదల చేసిన శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ (Shloka Entertainments) తాజాగా ట్వీట్ (Tweet) చేసింది. ఇప్పటివరకు 2.2 మిలియన్ల కలెక్షన్లు రాబట్టినట్లు ట్వీట్లో పేర్కొంది. ఇక ఇంతకుముందు చిరు నటించిన ఖైదీ నం. 150, సైరా నరసింహారెడ్డి కూడా రెండు మిలియన్ల మార్క్‌ను అందుకున్నాయి. ఇప్పుడు వీరయ్య ఆ మార్క్‌ను క్రాస్‌చేసి మూడో చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుందని చెప్పిన శ్లోకా.. అభిమానుల కోరిక మేరకు ఒకేరోజు ఒకే సమయంలో 25 వేర్వేరు నగరాల్లో ప్రత్యేకంగా 25 ఫ్యాన్ షోలు వేస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 22న సాయంత్రం 6గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) ఈ షోలు ఉంటాయని తెలిపింది.
ఇక ఈ చిత్రంలో చిరంజీవి ఔట్ అండ్ ఔట్ ఊర మాస్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. చిరు నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అవన్ని ఈ మూవీలో పుష్కలంగా ఉండడంతో దూసుకెళ్తోంది. రెగ్యులర్ చిరంజీవి మార్క్ చిత్రంగా అభిమానుల్లో జోష్ నింపింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన 'వీరయ్య'కు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మంచి హెల్ప్ అయింది. మెగాస్టార్‌కు జోడిగా శృతిహాసన్ నటించిన ఈ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ క్యారెక్టర్ సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. రవితేజ పాత్ర సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. మొత్తంగా సంక్రాంతి బరిలోకి దిగిన 'వాల్తేరు వీరయ్య' క్లీన్ హిట్‌ను నమోదు చేశాడు.