TDP: తనయుడిని పోటీలో నిలిపేందుకు తండ్రి యత్నాలు.. ఈ యువనేత మరెవరో కాదు..

ABN , First Publish Date - 2023-07-07T16:44:03+05:30 IST

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు, రంగారెడ్డి జడ్పీ మాజీ చైర్మన్‌ కాసాని జ్ఞానేశ్వర్‌ పరిగి అసెంబ్లీ సీటుపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో పరిగి నుంచి తన తనయుడు కాసాని వీరేష్‌ను పోటీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు.

TDP: తనయుడిని పోటీలో నిలిపేందుకు తండ్రి యత్నాలు.. ఈ యువనేత మరెవరో కాదు..

పరిగి సీటుపై కాసాని నజర్‌!

తనయుడిని పోటీలో నిలిపేందుకు జ్ఞానేశ్వర్‌ యత్నాలు

పాత క్యాడర్‌ను రప్పించేందుకు చర్యలు

స్థానిక నాయకులను కలుస్తున్న కాసాని వీరేష్‌

పరిగి: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు, రంగారెడ్డి జడ్పీ మాజీ చైర్మన్‌ కాసాని జ్ఞానేశ్వర్‌ పరిగి అసెంబ్లీ సీటుపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో పరిగి నుంచి తన తనయుడు కాసాని వీరేష్‌ను పోటీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు.

357703813_804195341164775_2878033436278979912_n.jpg

ఉమ్మడి జిల్లాలో మంచి సంబంధాలు, రాజకీయ పట్టు ఉన్న కాసాని టీడీపీకి పూర్వవైభవం తెచ్చే పనిలో ఉన్నారు. టీడీపీ పాత లీడర్లు, క్యాడర్‌ను సొంత గూటికి రప్పించే ప్రయత్నాల్లో భాగంగా ఫోన్లు చేయడం, కలవడం చేస్తున్నారు.

345047900_1054353559284061_1684011494443993240_n.jpg

బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం పరిగి. ఇక్కడ ముదిరాజ్‌ కమ్యూనిటీ ఎక్కువ. గతంలో కాసాని పరిగి నుంచి పోటీ చేస్తానని ప్రకటించినా కొన్ని పరిస్థితుల వల్ల పోటీ చేయలేదు. అయినా నాయకులతో సత్సంబంధాలు కొనసాగించారు.

351502345_245776454730162_6196451840019324225_n.jpg

పరిగిలో మినీ మహానాడును విజయవంతంగా నిర్వహించారు. తన కొడుకు వీరేష్‌ను పరిగి నుంచి పోటీ చేయించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ, ముదిరాజ్‌ కార్డుతో నియోజకవర్గంలో పట్టు సాధించొచ్చని అనుకుంటున్నారు.

345572150_257376010006829_5787774414805167844_n.jpg

టీడీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న వీరేష్‌ను పరిగి ఇన్‌చార్జిగా నియమించారు. వీరేష్‌ పరిగిలోనే నివాసం కోసం అన్వేషిస్తున్నారు. టీడీపీ-బీజేపీ పొత్తుకు అవకాశాలున్నాయని, పరిగికి టీడీపీ కేటాయిస్తారని అనుకుంటున్నారు. వ్యూహంలో భాగంగానే మండల కేంద్రాల్లో, చౌరస్తాల్లో టీడీపీ కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ముమ్మరంగా పర్యటిస్తూ ఆలయ నిర్మాణాలకు, చావులకు ఆర్థిక చేయూతనందిస్తున్నారు.

344353077_544348381225164_5528546591444528589_n.jpg

పరిగికి కాసాని వీరేష్‌ వస్తే త్రిముఖ నెలకొననుంది. వీరేష్‌ సైతం టీడీపీ పాత నాయకుల వద్దకు వెళ్లి కలుస్తున్నారు. పరిగిలో టీడీపీ చాలాసార్లు గెలిచిందని, క్యాడర్‌ సమష్టిగా పనిచేస్తే గెలుపు సాధ్యమే అని చెబుతూ వారిని తనకు మద్దతిచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - 2023-07-07T16:44:05+05:30 IST