Brahmaji: నేను పాన్ ఇండియా స్టార్

ABN , First Publish Date - 2023-01-30T20:46:53+05:30 IST

‘గులాబీ’ (Gulabi), ‘నిన్నే పెళ్లాడతా’ (Ninne Pelladatha) వంటి కల్ట్ క్లాసిక్స్‌తో తనకంటూ పత్ర్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు బ్రహ్మాజీ (Brahmaji). ‘సింధూరం’, ‘ప్రేమ లేఖ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు.

Brahmaji: నేను పాన్ ఇండియా స్టార్

‘గులాబీ’ (Gulabi), ‘నిన్నే పెళ్లాడతా’ (Ninne Pelladatha) వంటి కల్ట్ క్లాసిక్స్‌తో తనకంటూ పత్ర్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు బ్రహ్మాజీ (Brahmaji). ‘సింధూరం’, ‘ప్రేమ లేఖ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. తాజాగా ‘18పేజెస్’ (18 Pages) లో నటించారు. విభిన్న ప్రయత్నంగా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ చిత్రం ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్, ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్‌లో విడుదలైన వెర్షన్‌లో బ్రహ్మాజీ పాత్ర లేదు. ఓటీటీలో విడుదలైన వెర్షన్‌తో పాటు ఓవర్సీస్ ప్రింట్స్‌లో మాత్రం ఆయన పాత్ర ఉంది. ఫలితంగా ఆయన సరదాగా స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

‘బ్రహ్మాజీ ‘18పేజెస్’ లో మొక్కజొన్న జోగినాథం అలియాస్ మోజో పాత్రలో కనిపించారు. స్ర్రీన్‌పై మెరిసింది కాసేపే అయినప్పటికీ ప్రేక్షలకులను తన నటనతో మెస్మరైజ్ చేశారు. కడుపుబ్బా నవ్వించారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ వెర్షన్‌లో ఆయన సీన్స్ ఉండటంతో జోక్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌ను షేర్ చేశారు. ‘‘ప్రస్తుతం నేను పాన్ ఇండియా స్టార్. అందువల్లే నెట్‌ఫ్లిక్స్ వెర్షన్, ఓవర్సీస్ ప్రింట్స్‌లో నా సీన్స్ ఉన్నాయి’’ అని బ్రహ్మాజీ ట్విట్టర్‌లో పోస్ట్‌ను పెట్టారు. ‘18పేజెస్’ కు సుకుమార్ కథను అందించారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. బ్రహ్మాజీ తాజాగా ‘గాడ్ ఫాదర్’, ‘మాచర్ల నియోజక వర్గం’, ‘సర్కారు వారి పాట’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2023-01-30T20:50:55+05:30 IST