Ajith Kumar: ‘తుణివు’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ABN , First Publish Date - 2023-02-03T15:58:22+05:30 IST

అజిత్ నటించిన చిత్రం ‘తుణివు’ (Thunivu). థియేటర్‌లో ఈ సినిమాను మిస్ అయిన వారంతా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అందరి ఎదురు చూపులకు తెర దించుతూ ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్సయింది.

Ajith Kumar: ‘తుణివు’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

కోలీవుడ్ స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ (Ajith Kumar) ఒకరు. యూత్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘తల’ నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తాజాగా అజిత్ నటించిన చిత్రం ‘తుణివు’ (Thunivu). బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో మూవీ తెరకెక్కింది. థియేటర్‌లో ఈ సినిమాను మిస్ అయిన వారంతా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అందరి ఎదురు చూపులకు తెర దించుతూ ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్సయింది.

‘తుణివు’ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఈ మూవీ ఫిబ్రవరి 9నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘‘విస్ఫోటనానికి సమయం ఆసన్నమైంది. అజిత్ సినిమా చివరకు వస్తుంది. ‘తుణివు’ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మీ ముందుకు రానుంది’’ అని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ‘తుణివు’ కు హెచ్. వినోద్ (H. Vinoth) దర్శకత్వం వహించారు. బొనీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. మంజువారియర్, సముద్ర ఖని, జాన్ కొక్కెన్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్ ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పించినప్పటికీ టాలీవుడ్ వారిని మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

Updated Date - 2023-02-03T16:00:47+05:30 IST