Share News

BABA Vanga: 2024లో ఏం జరగనుందో ముందో చెప్పిన బాబా వాంగా.. కాలజ్ఞానంలో ఏం ఉందంటే..

ABN , Publish Date - Dec 28 , 2023 | 03:40 PM

బాబా వాంగ(Baba Vanga) బల్గేరియా దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని(Bulgarian psychic). ఈవిడ జోస్యం చాలా సందర్భాలలో నిజమైంది. బాబా వాంగ బతికున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజమవుతుండడంతో వివిధ దేశాలకు చెందిన ప్రజలు, రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి తమ భవిష్యత్ గురించి చెప్పించుకునేవారు.

BABA Vanga: 2024లో ఏం జరగనుందో ముందో చెప్పిన బాబా వాంగా.. కాలజ్ఞానంలో ఏం ఉందంటే..

న్యూయార్క్: బాబా వాంగ(Baba Vanga) బల్గేరియా దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని(Bulgarian psychic). ఈవిడ జోస్యం చాలా సందర్భాలలో నిజమైంది. బాబా వాంగ బతికున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజమవుతుండడంతో వివిధ దేశాలకు చెందిన ప్రజలు, రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి తమ భవిష్యత్ గురించి చెప్పించుకునేవారు. ఆమె 1996లో మరణించింది. మరణానికి ముందే.. 5079వ సంవత్సరం వరకు భవిష్యత్తును ఊహించింది. మరో పక్షం రోజుల్లో 2024లో అడుగుపెట్టబోతున్న సందర్భంగా భూమండలానికి ఆమె పలు సూచనలు చేసింది. ఎదుర్కొబోయే విపత్తులను ముందే అంచనా వేసింది. అవేంటంటే?

రష్యా అధ్యక్షుడి మరణం: రష్యా అధ్యక్షుడు 2024లో హత్యకు గురవుతారని బాబా వాంగా జోస్యం చెప్పడం కలకలం రేపుతోంది.

వాతావరణ సంక్షోభాలు: వచ్చే ఏడాది తీవ్ర వాతావరణ సంక్షోభం ఎదురుకాబోతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, అడవి మంటలు, కరువు వంటివాటితో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అతివృష్టి, అనావృష్టి సాధారణమైపోతుంది.

చైనా యుద్ధం: 2024నాటికి చైనా ఆర్థిక వృద్ధి సాధిస్తుంది. అయితే చైనా పొరుగు దేశాలతో సముద్ర యుద్ధానికి దిగే అవకాశం ఉంది.


AI, సైబర్ దాడులు: AI(ఆర్టిఫిషియల్ ఇంటెలజెన్స్) ప్రపంచాన్ని శాసించే శక్తిని కలిగి ఉంటుందని బాబా వాంగా అంచనా వేశారు. మరోవైపు, క్వాంటం కంప్యూటింగ్ పెరగడంతో ఫైనాన్స్, హెల్త్‌కేర్, సైబర్ సెక్యూరిటీ రంగాలకు అంతరాయం కలుగుతుంది. సైబర్ దాడి చేసేవారు పవర్ గ్రిడ్‌ల వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జాతీయ భద్రతకు ముప్పును పెంచుతారని వాంగా అంచనా వేసింది.

క్యాన్సర్లు, అల్జీమర్స్ నివారణ: ఇన్ని బ్యాడ్ న్యూస్ ల మధ్య ఓ గుడ్ న్యూస్ కూడా చెప్పింది బాబా వాంగా. అదేంటంటే 2024లో పలు రకాల క్యాన్సర్లు, అల్జీమర్స్ వ్యాధులకు నివారణ, చికిత్స అందుబాటులోకి వస్తుందట.

Updated Date - Dec 28 , 2023 | 05:47 PM