Bhushan Kumar: ‘యానిమల్’ గ్యాంగ్‌స్టర్ సినిమా.. ‘స్పిరిట్’ కాప్ డ్రామా..

ABN , First Publish Date - 2023-01-15T19:05:05+05:30 IST

బాలీవుడ్ బడా నిర్మాతల్లో భూషణ్ కుమార్ (Bhushan Kumar) ఒకరు. ‘యానిమల్’ (Animal) సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రభాస్ మూవీ ‘స్పిరిట్’ (Spirit) ను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Bhushan Kumar: ‘యానిమల్’ గ్యాంగ్‌స్టర్ సినిమా.. ‘స్పిరిట్’ కాప్ డ్రామా..

బాలీవుడ్ బడా నిర్మాతల్లో భూషణ్ కుమార్ (Bhushan Kumar) ఒకరు. ‘యానిమల్’ (Animal) సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రభాస్ మూవీ ‘స్పిరిట్’ (Spirit) ను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు సందీప్ రెడ్డే దర్శకత్వం వహిస్తున్నాడు. భూషణ్ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ఆసక్తికర కబుర్లను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

‘‘యానిమల్ సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతుంది. చిత్రంలో కుటుంబ అనుబంధాలకు కూడా చోటుంది. తండ్రి కొడుకుల రిలేషన్‌షిప్‌ను సినిమాలో చూపిస్తాం. తన తండ్రి కోసం హీరో ఏం చేశాడనేది చిత్ర కథాంశం. ‘యానిమల్‌’ లో యాక్షన్, రొమాన్స్, రివెంజ్, డ్రామా, థ్రిల్, మ్యూజిక్ అన్ని అంశాలుంటాయి. ఈ మూవీ అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది’’ అని భూషణ్ కుమార్ చెప్పాడు. ‘యానిమల్’ లో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరో, హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే సందీప్ ‘స్పిరిట్’ పనులను మొదలుపెట్టనున్నడని భూషణ్ పేర్కొన్నాడు. ఈ ఏడాది చివరలో ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందని చెప్పాడు. ‘‘స్పిరిట్ అనేది కొత్త చిత్రం. కాప్ డ్రామాతో రూపొందుతుంది. ప్రభాస్ ఈ సినిమాలో పోలీసుగా కనిపించనున్నాడు’’ అని అతడు స్పష్టం చేశాడు.

యానిమల్ సినిమా మంచి విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని భూషణ్ కుమార్ వ్యక్తం చేశాడు. ‘‘పాత్రల డబ్బింగ్ అన్ని భాషల్లో సరిగ్గా ఉండేలా చూసుకుంటున్నాం. సందీప్ దక్షిణాదికి చెందినవాడు. అతడికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రష్మిక కూడా దక్షిణాదికీ చెందిన తారే. సౌత్‌కు చెందిన మరి కొంత మంది కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, కన్నడ ఇతర భాషల్లో అద్భుతంగా రిలీజ్ చేస్తాం’’ భూషణ్ కుమార్ తెలిపాడు.

Updated Date - 2023-01-15T19:07:49+05:30 IST