Malayalan Cinema, First Women Actor : ఆ పాత్రలో నటించిందని ఈ హీరోయిన్‌కి ఏగతి పట్టిందో తెలుసా...!

ABN , First Publish Date - 2023-02-10T10:58:41+05:30 IST

మహిళగానే కాకుండా, దళిత క్రైస్తవుల వర్గానికి చెందినది కావడంతో గట్టి ప్రతిఘటన ఎదురైంది.

Malayalan Cinema, First Women Actor : ఆ పాత్రలో నటించిందని ఈ హీరోయిన్‌కి ఏగతి పట్టిందో తెలుసా...!
First Women Actor

సమాజంతో సహవాసం అంత తేలికైన విషయం కాదని, కులమతాల అడ్డంకులను దాటి మనగలగడం ఎంత సహసంతో కూడుకున్నదో తెలిపేదే ఆమె జీవితం. ఒకప్పటి కాలంలో ఆడదైన ఆదిశక్తిని పూజించినా.., ఇంట్లో తిరిగే ఆడదానికి అడుగడుగునా అడ్డంకులే ఉండేవి. స్వేచ్ఛకోసం పరితపించి దైర్యంగా నిలబడే ఆడవారికి సైతం కులమతాల అడ్డంకులు, ఎదురుదెబ్బలు కొడుతూనే ఉండేవి. ఆమె కులం తనలోని నటనను ఆపలేకపోయింది. హీరోయిన్ గా మంచి గుర్తింపుతో ఎదుగుతున్న క్రమంలోనే కులం కట్టుబాట్లు అడ్డుకట్టవేసాయి. అయినా మొక్కవోని ధైర్యంతో అన్నింటినీ దాటింది, ఆమె రోజీ, రోజీ కథను చాలామందికి తెలిసేలా చేసింది Google, ఎందరో గొప్పవారి ముఖ చిత్రాలను గురించి సంభాషించే Google ఈరోజు హీరోయిన్ రోజీ కథను చెపుతుంది. ఆమె గురించి తెలుసుకోవాలంటే...

PK రోసీ 1903లో కేరళలోని అదే ఇప్పటి తిరువనంతపురంలో త్రివేండ్రంలో జన్మించింది. అసలు పేరు రాజమ్మ. ఆమెకు చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తి ఉండేది. ఈ విషయం గమనించిన రోజీ మేనమామ దీనిని ప్రోత్సహించి ఆమెకు నటన, సంగీత శిక్షణను ఇప్పించాడు. రోసీ తమిళ, మలయాళీ జానపద నాటక రంగ ప్రవేశానికి నటనలో తర్ఫీదు తీసుకుంది. రోజీ మొదటి మలయాళ చలనచిత్రం విగతకుమారన్ (1928)లో ఒక పాత్ర పోషించింది. దీనికి JC డేనియల్ దర్శకత్వం వహించారు, ఈయనే రాజమ్మకు, రోజీ అనే పేరు పెట్టాడు. రోజీ దళిత కులానికి చెందినది కావడం వల్ల ఆమె నాయర్ కమ్యూనిటీకి చెందిన మహిళ పాత్రను పోషించడంతో అప్పటి అగ్రకులస్థులు దీనిని అడ్డుకున్నారు. సినిమా మీదనే కాదు రోజీ మీద కూడా చాలా ఆగ్రహాన్ని చూపించారు.

WhatsApp Image 2023-02-10 at 10.58.39 AM (2).jpeg

విగతకుమారన్ సినిమా ప్రారంభోత్సవానికి ప్రముఖ న్యాయవాది మధూర్ గోవిందన్ పిళ్లైతో సహా రోజీ అక్కడ హాజరు కావడాన్ని సినీ పరిశ్రమలోని చాలా మంది ప్రముఖులు నిరాకరించారు. ప్రధాన పాత్ర ఆమె జుట్టులో ఒక పువ్వును ముద్దాడిన సన్నివేశాన్ని చూసి, ప్రేక్షకులు స్క్రీన్‌పై రాళ్లు విసిరారు. థియేటర్‌లో ఓపెనింగ్‌కి ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో దర్శకుడు డేనియల్ రోజీని ఆహ్వానించలేదు. కానీ రోజీ ఏమైనప్పటికీ హాజరైంది, అయితే ఈవెంట్‌ను బహిష్కరించిన వారు సెకండ్ షో చూసేలా చేశారు.

పరిశ్రమలో మహిళగానే కాకుండా, దళిత క్రైస్తవుల వర్గానికి చెందినది కావడంతో రేజీకి గట్టి ప్రతిఘటన ఎదురైంది. ఆమె తల్లిదండ్రులు రోజువారీ కూలీ పని చేసేవారు., రోజీ స్వయంగా జీవనోపాధి కోసం గడ్డి కోయడం, పశువులను సాకడంతో పాటు తనకు నచ్చిన నటన మీద కూడా ఆసక్తిగా ఉండేది.

uy.jpg

ఇక్కడితో రోజీపై ఆగ్రహం చల్లారని అగ్రవర్ణాలవారు నాయర్ గా నటించిన మరో చిత్రం 'నేరం' చిత్రంమీద మరింత కోపంతో ఊగిపోయారు. రోజీ ఉంటున్న ఇంటినే తగలబెట్టేందుకు సాహసించారు. ఇల్లు కాలిపోయాకా రోజీ విరక్తితో చలించిపోయింది. తమిళనాడు వెళుతున్న లారీ ఎక్కి ఉన్న ఊరిని, అయిన వాళ్ళను వదిలిపోయింది. ఆ లారీ డ్రైవర్ కేశవన్ పిళ్లైనే వివాహమాడింది. తమిళనాడులో రాజమ్మాళ్ గా మారి తన జీవితాన్ని ప్రశాంతంగా గడిపింది. ఒక థియేటర్ ఆర్టిస్ట్, పిళ్లై కులంలో నాయర్లుగా జీవించడం తప్ప ఆమె పిల్లలకు తల్లి చిన్న స్టార్‌డమ్ గురించి ఏమీ తెలియకుండానే కాలం గడిచిపోయింది.

ఆమె తన జీవితకాలంలో తన నటనకు గాను ఎటువంటి గుర్తింపు పొందలేదు. కానీ నేటి గూగుల్ డూడుల్ లో చుట్టూ గులాబీలతో ఫిల్మ్ రీల్‌పై పెయింట్ చేయబడిన Google లోగో ముందు PK రోసీ పోర్ట్రెయిట్‌ను వేసి గౌరవించింది. మలయాళ చిత్రసీమలో తొలి ప్రముఖ మహిళగా గుర్తింపు పొందిన భారతీయ నటి పీకే రోసీ 120వ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించింది.

2013లో సెల్యులాయిడ్ పేరుతో డేనియల్ బయోపిక్‌కి కమల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పాక్షికంగా విను అబ్రహం రాసిన నష్ట నాయక అనే నవల ఆధారంగా రూపొందింది. ఇందులో చాందిని గీత, రోజీ పాత్రను పోషించింది. ఈ మలయాళ నటి తన కెరియర్లో అనేక అడ్డంకులను అధిగమించవలసి వచ్చింది. పరిశ్రమలో మహిళగానే కాకుండా, దళిత క్రైస్తవుల వర్గానికి చెందినది కావడంతో ఆమెకు గట్టి ప్రతిఘటన ఎదురైంది. ఇలా మరెందరో అవమానాలు, చీదరింపులతో తెరమరుగైనవారు.

Updated Date - 2023-02-10T11:31:18+05:30 IST