2023 మరింత ఘోరంగా ఉండబోతోందా..? మరణాలు పెరుగుతాయ్.. ఉద్యోగాలు ఊడిపోతాయట..!

ABN , First Publish Date - 2023-01-02T16:46:05+05:30 IST

2023 విషయంలో కూడా 2022 కంటే బాగుంటుంది అనే ఆశ కలగడం సహజం. అయితే అలాంటి ఆశలు ఏవీ పెట్టుకోవద్దని

2023 మరింత ఘోరంగా ఉండబోతోందా..? మరణాలు పెరుగుతాయ్.. ఉద్యోగాలు ఊడిపోతాయట..!

ఈరోజుకంటే రేపు ఎంతో బాగుంటుందని అనుకోవడం సహజం. రేపటిలో గొప్ప ఆశ దాగుంటుంది. కరోనా తరువాత కొత్త సంవత్సరం మొదలయ్యే ప్రతిసారీ ఇకమీద ఇలాంటి సమస్యలు ఏవీ ఉండవులే అనుకుంటూ వస్తున్నారు అందరూ. కానీ ప్రతిసారీ మునుపటికంటే చాలా నష్టాలు జరుగుతున్నాయి. 2023 విషయంలో కూడా 2022 కంటే బాగుంటుంది అనే ఆశ కలగడం సహజం. అయితే అలాంటి ఆశలు ఏవీ పెట్టుకోవద్దని స్పష్టం చేస్తున్నాయి కొన్ని విషయాలు. ఇంతకూ 2023 గురించి కలవరపెడుతున్న విషయాలు ఏమిటంటే..

గుండెకు గండి పడుతోంది..

గత సంవత్సరాలతో పోలిస్తే 2023లో గుండె సంబంధ సమస్యల వల్ల సంభవించే మరణాల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కరోనా కారణంగా గుండె సంబంధ సమస్యలు ఎక్కువ అవుతున్నాయట. ఇది కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలలో కూడా జరుగుతోంది. ముఖ్యంగా 25 నుండి 44 సంవత్సరాల వయసు గల వారిలో గుండె సంబంధ సమస్యల కారణంగా ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా వల్ల చాలా ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కుని బయటపడినవారిలో సగం మందికి పైగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.

పొంచి ఉన్న యుద్దం ముప్పు

రష్యా, ఉక్రెయిన్ మధ్య 2022, ఫ్రిబ్రవరి 24న మొదలైన యుద్దం 10నెలలు గడిచినా ముగింపుకు రావడం లేదు. కొన్ని రోజులలో ముగిసిపోతుందని అనుకున్నది ఇలాగే కొనసాగుతూ ఉండటంతో ఇది మరింత దీర్ఘకాలం సాగితే ప్రపంచయుద్దంగానూ, రష్యాకు, అమెరికాకు మద్య ప్రత్యక్ష యుద్దంగానూ మారే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కనుక అణు యుద్దానికి దారితీస్తే.. చాలా ప్రమాదకర స్థాయిలో నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.

ద్రవ్యోల్బణం వచ్చేస్తుంది..

2022 సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 100ట్రిలియన్ డాలర్లు దాటినా 2023లో మాత్రం ద్రవ్యోల్బణం తప్పదంటున్నారు విశ్లేషకులు. దీనికి కారణం వడ్డీరేట్ల పెరుగుదల అనే విషయం కాస్త విస్మయపరుస్తోంది. బ్యాంకులు వడ్డీరేట్లు పెంచడం వల్ల రుణాలు తీసుకోవడం తగ్గిపోతుంది, దీని ద్వారా మార్కెట్ లో ఉత్పత్తుల డిమాండ్ తగ్గుతుంది. ఇదే ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. 2022 సంవత్సరంలో 8.8శాతం ద్రవ్యోల్బణం రేటు ఉండగా అది 2023కు 6.5శాతానికి తగ్గిపోతుందని, 2024 సంవత్సరానికి 4.1శాతానికి చేరుతుందని విశ్లేషకుల అంచనాలు చెబుతున్నాయి. అదే విధంగా అబివృద్ది రేటు కూడా ఈ సంవత్సరం 2శాతానికంటే తక్కువ నమోదు అవుతుందని వెల్లడిస్తున్నారు. ఆర్థికలోటు కారణంగా మార్కెటింగ్ కూడా కుదేలు అవుతుంది దీనివల్ల ఉద్యోగస్తులకు కష్టాలు తప్పవు, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయి నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది.

సూపర్ బగ్ విలయం

కరోనా వచ్చినప్పటి నుండి 2022 డిసెంబర్ 31 వరకు 60లక్షల మంది కరోనా కారణంగా చనిపోయారు. ఎంతోమంది చావు నుండి తప్పించుకున్నారు. అయితే వీరిలో రోగనిరోధకవ్యవస్థ బలహీనం అయిపోయింది. వ్యాక్సిన్ కు వ్యతిరేకంగా ప్రతిబంధకాలను వైరస్ అభివృద్ది చేసుకోగలుగుతుంది. ఇలా అభివృద్ది అవుతున్న వైరస్ జాతిని సూపర్ బగ్ అని అంటున్నారు. వైరస్ ఇలా మారితే ఎలాంటి మందూ వైరస్ మీద ప్రభావం చూపించదు. గడిచిన 15సంవత్సరాలలో యాంటీ బయోటిక్స్ వాడకం 65శాతం పెరిగింది. వీటిని ఇష్టానుసారం వాడటం వల్ల ప్రతి మూడు యాంటీ బయోటిక్స్ లో ఒకటి పనిచేయకుండా పోతోంది. కరోనా మీద ప్రభావవంతంగా పనిచేయడం కోసం కొత్తగా మందులను కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమైపోయారు.

వాతావరణ పరిస్థితులు

అనూహ్యంగా మారిపోయే వాతావరణ పరిస్థితుల వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. మంచు తుఫానులు, అకాల వర్షాలు, భూకంపాలు, అత్యల్ప, అధిక ఉష్ణోగ్రత నమోదు కావడం మొదలయిన వాటివల్ల చెప్పలేనంత నష్టం సంభవిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ ద్వారా ప్రకృతిలో చాలా నష్టాలు జరుగుతాయి. ఇవీ 2023 లో అందరినీ కలవరపెడుతున్న విషయాలు.

Updated Date - 2023-01-02T16:46:07+05:30 IST