World Wildlife Day 2023: కాపాడుకోలేకపోతే కనిపించవ్..?

ABN , First Publish Date - 2023-03-03T10:55:47+05:30 IST

మహా అయితే మన ఇళ్ళల్లో ఓ పిల్లినో, కుక్కనో, చిలకనో తప్పితే మరే ఇతర జీవులను అంతగా సాకేదీ ఉండదు.

World Wildlife Day 2023: కాపాడుకోలేకపోతే కనిపించవ్..?
Wildlife Day

వన్య ప్రాణులు వీటి గురించి చాలావరకూ టీవీల్లోనో, యూట్యూబ్ వీడియోల్లోనో చూడటమే కానీ ఈ జీవుల గురించి సరైన అవగాహన గానీ, వాటి గురించిన పూర్తి సమాచారం కానీ మామూలు జనాలకు అంతగా తెలీదు. మహా అయితే మన ఇళ్ళల్లో ఓ పిల్లినో, కుక్కనో, చిలకనో తప్పితే మరే ఇతర జీవులను అంతగా సాకేదీ ఉండదు. అయితే వీటి రక్షణ ఎవరు చూస్తారు? అసలు ఈ జీవులకు ఓ రోజుందా? ఉంటే అది ఎందుకోసం? ఇలాంటి వాటి గురించి ఈ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం రోజున చర్చించుకోవడం ఎంతైనా అవసరం.

మార్చి 3 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం..

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మార్చి 3వ తేదీని ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా ప్రకటించింది. ఈ గ్లోబల్ ఈవెంట్ మొత్తం భూమిమీద అడవి జంతుజాలం, వృక్షజాలం అవగాహనను తెచ్చేలా జరుపుకుంటున్నాం. ఈ రోజును 1973 నుంచి అంతరించిపోతున్న జంతుజాలం, వృక్షజాలం మీద అవగాహనను కల్పిస్తుంది. (CITES)లో అంతరించిపోతున్న జాతులలో అంతర్జాతీయ వాణిజ్యంపై జాతుల మనుగడకు ముప్పు వాటిల్లకుండా నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది.

అంతరించిపోతున్న ప్రపంచ వన్యప్రాణులు..

బోర్నియోలోని ఒరంగుటాన్లు, సుమత్రా ఏనుగులు, నల్ల ఖడ్గమృగం అన్నింటినీ యూట్యూబ్‌లో చూడటమే తప్పితే ఈ జీవుల గురించి ఎలాంటి సమాచారం మనకు తెలీదు., అయితే ఇలాంటి జీవులన్నీ కూడా అంతరించిపోతున్న జాతులుగా గుర్తించబడ్డాయి.

ఒకప్పుడు ఎన్నో వందల సంవత్సరాల కింద డైనోసార్లు భారీ ఉల్క తాకడంతో అంతరించిపోయాయి. ఒకప్పుడు ఉన్న జీవజాతుల గురించి మనలో చాలామందికి తెలిసింది కూడా తక్కువే. అయితే ఇప్పుడు మనతో పాటు జీవిస్తున్న చాలా జీవులు అంతరించిపోవడానికి మాత్రం మనుషులు చేస్తున్న ప్రకృతి విలయమే కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. చాలా వరకూ మన చుట్టూ పర్యావరణాన్ని కాలుష్యం కోరల్లో చిక్కేలా చేయడం, అడవుల్ని నరికేయడం, అధికమైన వేట, మైనింగ్, అరుదైన జీవజాతులను వెతికి పట్టుకోవడం, అక్రమ రవాణా, జీవావరణాన్ని కలుషితం చేసే కెమికల్ వినియోగం, నీటి కాలుష్యం ఇటువంటి చర్యల వల్ల జీవులు, వృక్షాలు అంతరించిపోయేందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

అయితే ఇలా అంతరించిపోతున్న అడవుల వల్ల ఆవాసాలను కోల్పోయి, సరైన పోషణలేక ఆహారం అందక, వన్యమృగాలు ఊళ్ళమీద పడుతున్నాయి. ఈమధ్య కాలంలో చూస్తే చాలా ప్రదేశాల్లో పులులు, ఎలుగుబంట్లు, చిరుతలు, పాములు, ఏనుగులు ఇలా రకరకాల జీవులు మనవ నివాసాలపై దాడి చేస్తున్న ఘటనలను కూడా చాలానే చూస్తున్నాం. దీనంతటికీ కారణం వాటిని గురించి ఎవరూ ఆలోచించకపోవడమే. జీవులు అంతరించిపోవడానికి మనషులు చేస్తున్న తప్పిదాలు కూడా చాలా వరకూ కారణం అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: దంపతులూ జరజాగ్రత్త!.. ఈ 7 అలవాట్లు ఉంటే మీ భాగస్వామి దూరమయ్యే ప్రమాదం ఉంది.. అవి ఏంటంటే..

ప్రస్తుత అంచనాల ప్రకారం మొత్తం ప్రపంచంలో దాదాపు 2,500 నల్ల ఖడ్గమృగాల సంఖ్య ఉంది. రష్యాలోని అముర్ చిరుతపులి, దేశంలోని సుదూర తూర్పు మాంద్యాలలో కనుగొన్నారు, ఇది కూడా ప్రమాద అంచున ఉంది, ఇవి ప్రపంచంలో కేవలం 40 మాత్రమే మిగిలి ఉన్నాయి. అంతరించిపోతున్న జాతులపై అవగాహన పెంచడానికి, మనమందరం ఏమి చేయగలమో చర్చించేందుకు, ఈ విషయంగా అవగాహన కల్పించేందుకుగాను, UN మార్చి 3న ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకుంటోంది, ఈ బృందం ముఖ్యంగా అంతరించిపోతున్న జాతులలో, అంతరించిపోతున్న జంతుజాలం, వృక్షజాలం అవగాహనను కల్పిస్తుంది.

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని ఎలా పాటించాలి.

ప్రపంచంలోని వన్యప్రాణులకు అతిపెద్ద ముప్పులు, ఆవాసాల మార్పు, అధిక దోపిడీ, చట్టవిరుద్ధమైన ట్రాకింగ్ వంటి వాటి గురించి చర్చించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి 3న ఒకచోట చేరతారు. ప్రభుత్వాలు, సహజ ఉద్యానవనాల నాయకులు, పౌరులు, చట్టసభ సభ్యులు అందరూ ఈ విషయం మీద అవగాహన పెంచుకోవడానికి ఈవెంట్‌లను నిర్వహిస్తుంది. వేట, చట్టవిరుద్ధమైన వ్యాపారం, మితిమీరిన చేపలు పట్టడం, అటవీ నిర్మూలన, ఈ మానవ కార్యకలాపాలను అదుపు చేయగలిగితే, వన్యప్రాణుల సంరక్షణ అనేది స్థిరమైన ప్రపంచాన్ని సృష్టించడంలో అంతర్భాగం అవుతుంది.

Updated Date - 2023-03-03T10:57:23+05:30 IST