MLC Kavitha: అర్జున్ నిర్మించిన ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత

ABN , First Publish Date - 2023-02-10T16:31:21+05:30 IST

ఏ పాత్రను అయిన అలవోకగా పోషించే నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun). భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేశారు. ‘లై’, ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.

MLC Kavitha: అర్జున్ నిర్మించిన ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఏ పాత్రను అయిన అలవోకగా పోషించే నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun). భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేశారు. ‘లై’, ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. అర్జున్‌కు ధైవ భక్తి ఎక్కువ. అందుకే కొన్నాళ్ల క్రితం ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించారు. తాజాగా ఈ ఆలయాన్ని మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత (Kavitha) సందర్శించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులందరు షేర్ చేయడం మొదలుపెట్టారు.

Hanuman.jpg

ప్రముఖ దిన పత్రిక నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి కవిత చెన్నై వెళ్లారు. ఈ సందర్భంగా అర్జున్ నిర్మించిన దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ పూజలు చేశారు. అర్జున్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. చెన్నైకి రావడం ఎల్లప్పుడు సంతోషంగా ఉంటుందని కవిత తెలిపారు. తమిళనాడు సాంస్కృతి, సాంప్రదాయాలు, చారిత్రక, వారసత్వ సంపదను చూసి రాష్ట్ర ప్రజలందరు గర్వపడాలని పేర్కొన్నారు. ఆలయాన్ని నిర్మించినందుకు అర్జున్‌కు శుభాకాంక్షలు చెప్పారు.

యాక్షన్ సింగ్ అర్జున్ ప్రస్తుతం ‘లియో’ (Leo)లో కీలక పాత్రను పోషిస్తున్నారు. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లోకేశ్ కనకరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో అర్జున్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ సినిమా పాన్ ఇండియాగా రూపొందుతుంది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న విడుదల కానుంది.

Updated Date - 2023-02-10T16:31:23+05:30 IST