NBK 108: అనిల్ రావిపూడి, బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ ఫిక్స్!

ABN , First Publish Date - 2023-02-02T15:10:46+05:30 IST

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ వర్కింగ్ టైటిల్‌గా ‘ఎన్‌బీకే 108’ (NBK 108) అని వ్యవహరిస్తున్నారు.

NBK 108: అనిల్ రావిపూడి, బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ ఫిక్స్!

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ వర్కింగ్ టైటిల్‌గా ‘ఎన్‌బీకే 108’ (NBK 108) అని వ్యవహరిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా ఎంపికయిందని సమాచారం అందుతుంది. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చిత్ర బృందం నుంచి రానుందని తెలుస్తోంది. అయితే, బాలకృష్ణకు జోడీగా ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) నటిస్తుందని గతంలో రూమర్స్ హల్‌చల్ చేశాయి. ఆమెపై ఫొటో షూట్ కూడా చేసినట్టు ప్రచారం జరిగింది. ఏమైందో తెలియదు కానీ హీరోయిన్ ఛాన్స్ మాత్రం ప్రియాంక‌కు దక్కలేదు. ‘ఎన్‌బీకే 108’ లో నందమూరి బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నట్టు డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు.

Kajal-Aggarwal.gif

బాలయ్య చివరగా ‘వీరసింహా రెడ్డి’ లో నటించారు. శ్రుతి హాసన్ హీరోయిన్ పాత్రను పోషించింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. ఈ సినిమాలో వరలక్ష్మీ కుమార్, దునియా విజయ్, హానీ రోజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2023-02-02T15:12:30+05:30 IST