Nani: కొత్త సినిమాకు ముహుర్తం ఫిక్స్!

ABN , First Publish Date - 2023-01-28T17:21:42+05:30 IST

సినీ ఇండస్ట్రీలో స్వ శక్తితో అంచెలంచెలుగా ఎదిగిన నటుడు నేచురల్ స్టార్ నాని (Nani). ‘దసరా’ (Dasara) షూటింగ్‌ను ఈ మధ్యే ముగించారు. అనంతరం కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో పడ్డారు. ఈ మూవీకి ముహుర్తం ఫిక్సయినట్టు సమాచారం అందుతుంది.

Nani: కొత్త సినిమాకు ముహుర్తం ఫిక్స్!

సినీ ఇండస్ట్రీలో స్వ శక్తితో అంచెలంచెలుగా ఎదిగిన నటుడు నేచురల్ స్టార్ నాని (Nani). ‘దసరా’ (Dasara) షూటింగ్‌ను ఈ మధ్యే ముగించారు. అనంతరం కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో పడ్డారు. ఈ మూవీకి ముహుర్తం ఫిక్సయినట్టు సమాచారం అందుతుంది.

శౌర్యువ్ (Shouryuv) దర్శకత్వంలో నాని నటించనున్నారు. నేచురల్ స్టార్ 30వ సినిమాగా ఇది తెరకెక్కనుంది. ఈ చిత్రం ఫ్యామిలీ డ్రామాగా రూపొందనుంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ మూవీ జనవరి 31న పూజా కార్యక్రమాలు జరుపుకొనుంది. సినిమా షూటింగ్ ఫిబ్రవరి 1 నుంచి నిరంతారయంగా కొనసాగనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో నాని క్లీన్ షేవ్‌లో కనిపించనున్నారు. తండ్రి, కూతుళ్ల అనుబంధాల నేపథ్యంగా చిత్ర కథాంశం కొనసాగబోతున్నట్టు సమాచారం. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తున్నారు. సానూ జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. హషీమ్ అబ్దుల్ వాహెద్ సంగీతం అందిస్తున్నారు. నాని తాజాగా ‘దసరా’ లో నటించాడు. ఈ మూవీ టీజర్ జనవరి 30న విడుదల కానుంది. టీజర్ రిలీజ్ డేట్ దగ్గరపడిన తరుణంలో ‘దసరా’ కు సంబంధించిన ఓ అప్‌డేట్ ఫిల్మ్ నగర్‌లో షికార్లు కొడుతుంది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని వదంతులు షికార్లు కొట్టడం మొదలయ్యాయి. ఈ రూమర్స్ పై నాని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘‘ఒకటే భాగం. కానీ, రెండు లేదా అంతకంటే ఎక్కువ సినిమాల పవర్ ‘దసరా’ లో ఉంటుంది’’ అని నాని ట్వీట్ చేశారు.

Updated Date - 2023-01-28T17:25:02+05:30 IST