Pawan Kalyan: కొత్త సినిమాకు ముహుర్తం ఫిక్స్!

ABN , First Publish Date - 2023-01-27T20:45:08+05:30 IST

టాలీవుడ్‌లోని సూపర్ స్టార్స్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒకరు. ఆయనకు యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవర్ స్టార్ నుంచి సినిమా వస్తుందంటే అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

Pawan Kalyan: కొత్త సినిమాకు ముహుర్తం ఫిక్స్!

టాలీవుడ్‌లోని సూపర్ స్టార్స్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒకరు. ఆయనకు యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవర్ స్టార్ నుంచి సినిమా వస్తుందంటే అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఆయన వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే యంగ్ డైరెక్టర్ సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో నటించాడనికి ఒకే చెప్పారు. ఈ చిత్రానికి ముహుర్తం ఫిక్స్ అయినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.

పవన్ కల్యాణ్, సుజిత్ సినిమా జనవరి 30న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఆ రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు సమాచారం అందుతుంది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ రూ.100కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. పవన్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. జపాన్‌, ముంబయి నేపథ్యంలో కథ కొనసాగనుంది. సినిమాకు సంబంధించిన ప్రకటన చేస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పోస్టర్‌లో అనేక ఆసక్తికర అంశాలకు చోటిచ్చారు. పోస్టర్‌పై They Call Him #OG అని రాశారు. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అర్థం. జపనీస్ భాషలో FirestromIsComing అని రాశారు. పవన్ కల్యాణ్ నీడలో గన్ కనిపిస్తుంది. పవర్ స్టార్ ఓ సర్కిల్ ముందు నిల్చుంటాడు. అది జపాన్ జెండా. జపాన్‌లోని బుద్ధుడి విగ్రహానికి పోస్టర్‌లో స్థానమిచ్చారు. ఈ సినిమా డైరెక్టర్ పవన్‌కల్యాణ్‌కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. అందువల్ల పవన్ అభిమానులు కోరుకునే అంశాలన్నింటికి సుజిత్ చోటివ్వబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ ‘హరిహర వీరమల్లు’ లో నటిస్తున్నాడు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2023-01-27T20:49:07+05:30 IST