Share News

పేద్ద... క్రిస్మస్‌ ట్రీ

ABN , Publish Date - Dec 24 , 2023 | 10:57 AM

లోకమంతా క్రిస్మస్‌ పండగ కోసం ఎదురుచూస్తోంది. ఎటుచూసినా క్రిస్మస్‌ చెట్లు, నక్షత్రాలు, దీపకాంతులు, కేకులు....

పేద్ద... క్రిస్మస్‌ ట్రీ

లోకమంతా క్రిస్మస్‌ పండగ కోసం ఎదురుచూస్తోంది. ఎటుచూసినా క్రిస్మస్‌ చెట్లు, నక్షత్రాలు, దీపకాంతులు, కేకులు. అలాగే అద్దిరిపోయే అలంకరణలు. జర్మనీలోని డోర్ట్‌మండ్‌ నగరంలో క్రిస్మస్‌ వేడుకను చూడడానికి రెండు కళ్లు చాలవు. ఎందుకంటే ఏటా ప్రపంచంలోనే అతి పెద్ద కిస్మస్‌ ట్రీని ఇక్కడ తయారుచేస్తారు. ఇది అక్షరాలా 150 అడుగుల ఎత్తు, 40 టన్నుల బరువుతో ఉంటుంది. దాదాపు రెండు వేల స్ర్పూస్‌ మొక్కల్ని వినియోగిస్తారు. పైగా 40 వేల విద్యుద్దీపాలతో అందంగా ముస్తాబు చేస్తారు. నగరవాసులంతా కలిసి 4 వారాలు కష్టపడి ఈ క్రిస్మస్‌ ట్రీని నిర్మిస్తారు. నవంబరు, డిసెంబరులో ఇక్కడ మూడు వందల షాపులతో పెద్ద మేళానే నిర్వహిస్తారు. ఒక్క జర్మనీలోనే కాదు యూరప్‌ అంతా ఈ క్రిస్మస్‌ మార్కెట్‌ ప్రముఖమైందిగా పేరుతెచ్చుకుంది.

Updated Date - Dec 24 , 2023 | 10:57 AM