Ram Charan: ఆ జాబితాలో మా ఇద్దరి పేర్లు ఉండటం ఆనందంగా ఉంది

ABN , First Publish Date - 2023-02-25T15:17:01+05:30 IST

కాల్నిఫోర్నియాలో జరిగిన ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ అవార్డ్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం సత్తా చాటింది. ఐదు విభాగాల్లో పురస్కారాలను సొంతం చేసుకుంది. దీనితో మరోసారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుంది.

Ram Charan: ఆ జాబితాలో మా ఇద్దరి పేర్లు ఉండటం ఆనందంగా ఉంది

కాల్నిఫోర్నియాలో జరిగిన ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ (hollywood Critics associations) అవార్డ్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రం సత్తా చాటింది. ఐదు విభాగాల్లో పురస్కారాలను సొంతం చేసుకుంది. దీనితో మరోసారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుంది. అంతర్జాతీయ వేదికగా దక్కిన ఈ గౌరవాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ఆస్వాదిస్తున్నారు. ఇదే కాకుండా ‘క్రిటిక్స్‌ ఛాయిస్‌ సూపర్‌ అవార్డు’లో ( Critics Choice Awards)యాక్షన్‌ మూవీ విభాగంలో ఉత్తమ నటుడు కేటగిరీలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ పేర్లు ఉన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్‌ స్టార్స్‌ టామ్‌ క్రూజ్‌, బ్రాడ్‌ ఫిట్‌లతో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ పోటీ పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ రామ్‌చరణ్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. ‘క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డ్స్‌ లో బెస్ట్‌ యాక్టర్‌ ఇన్‌ యాక్షన్‌ మూవీ కేటగిరీలో టామ్‌ క్రూజ్‌, బ్రాడ్‌ పిట్‌ లాంటి దిగ్గజ నటులతోపాటు నా పేరు, నా బ్రదర్‌ (My brother NTR) ఎన్టీఆర్‌ పేరు కలిసి చూడడం ఆనందంగా ఉంది’ అని చరణ్‌ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం చెర్రీ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. (Ram charan tweet viral)

3.jpg

Updated Date - 2023-02-25T15:20:24+05:30 IST