Varasudu OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన ‘వారసుడు’.. చూసి ఎంజాయ్ చేయండి..
ABN , First Publish Date - 2023-02-22T09:06:51+05:30 IST
తమిళ నటుడు విజయ్ దళపతి (Vijay Thalapathy), తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘వారసుడు’ (Varasudu).
తమిళ నటుడు విజయ్ దళపతి (Vijay Thalapathy), తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘వారసుడు’ (Varasudu). తమిళంలో ‘వారిసు’ (Varisu)గా విడుదలైంది. తెలుగు టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీలో రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా.. శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్ కీలకపాత్రల్లో నటించారు. తమిళంలో జనవరి 12న, తెలుగులో జనవరి 14న విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే, చాలామంది సినీ లవర్స్‌కి ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో చూడడం కుదరలేదు. అలాంటి వారందరూ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
‘వారసుడు’ డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం స్ట్రీమింగ్ గురించి ప్రైమ్ వీడియో సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. యాజమాన్యం చెప్పినట్లుగానే ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే విజయ్‌కి ఉత్తరాదిన కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో హిందీలో కూడా స్ట్రీమింగ్ చేయమంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Veera Simha Reddy: అధికారికంగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే..