JanhviKapoor: తల్లి శ్రీదేవి గురించి ఏమి చెప్పిందంటే...
ABN , First Publish Date - 2023-02-21T15:02:00+05:30 IST
జాన్వీ కపూర్ (Janhvi Kapoor), అలనాటి అందాల నటి శ్రీదేవి (#Sridevi), బోనీ కపూర్ (BoneyKapoor) ల ముద్దుల కూతురు. సాంఘీక మాధ్యమాల్లో ఎప్పుడూ చలాకీగా, చురుకుగా తన ఫోటోస్ పెడుతూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది జాన్వీ కపూర్.
జాన్వీ కపూర్ (Janhvi Kapoor), అలనాటి అందాల నటి శ్రీదేవి (#Sridevi), బోనీ కపూర్ (BoneyKapoor) ల ముద్దుల కూతురు. సాంఘీక మాధ్యమాల్లో ఎప్పుడూ చలాకీగా, చురుకుగా తన ఫోటోస్ పెడుతూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది జాన్వీ కపూర్. తన తల్లి శ్రీదేవి 5వ వర్ధంతి ఈ నెల 24వ తేదీన రానుంది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ తన తల్లిని తలుచుకుంటూ భావోద్వేగమయిన (Emotional post by Janhvi) మాటలు తన సాంఘీక మాధ్యమం లో పెట్టింది. అలాగే తాను తన తల్లితో వున్న ఫోటో కూడా షేర్ చేసింది.
తన తల్లి గురించి జాన్వీ ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటుంది అని తెలుస్తోంది ఆ మాటలు చూస్తుంటే. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్లినా, నిన్నే తలుచుకుంటా, నీ గురించే వెతుకుతా అని పెట్టింది అంటే, తల్లి గురించి ఎంత ఆలోచిస్తోందో పాపం అనిపిస్తుంది. "నేను ఇప్పటికీ నీ కోసం ప్రతిచోటా వెతుకుతున్నాను అమ్మా, నేను చేస్తున్న ప్రతి పనీ, నువ్వు గర్వించదగ్గవిగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్లినా, ఏ పని చేసినా నీతోటె మొదలయి, నీతోటె ముగుస్తుంది", అని పోస్ట్ చేసింది జాన్వీ కపూర్.
ఇంకా జాన్వీ పని విషయానికి వస్తే, ఆమె పేరు ఇప్పుడు టాలీవుడ్ (#Tollywood) లో కూడా వినపడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ (#JrNTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో జాన్వీ కపూర్ పేరు ఖరారు అయినట్టుగా వార్తలు వస్తూనే వున్నాయి. అయితే అధికారికంగా ఇంకా వెలువడలేదు ఈ వార్త. ఈ వారం లో తెలియాల్సి వుండింది కానీ, జూనియర్ ఎన్టీఆర్ అన్న తారకరత్న అకాలమరణం (#Tarakaratna) తో అతని సినిమా లాంచ్ వాయిదాపయింది. అందువల్ల ఈ అధికారిక వార్త కోసం ఇంకా కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. జాన్వీ కపూర్ తెలుగు ఆరంగేట్రం అయితే ఖరారు అయినట్టుగానే కనపడుతోంది.