DC vs SRH: అభిషేక్, క్లాసెన్ అర్ధ సెంచరీలు.. హైదరాబాద్ భారీ స్కోరు

ABN , First Publish Date - 2023-04-29T21:26:17+05:30 IST

తొలుత అభిషేక్ శర్మ (Abhishek Sharma), ఇన్నింగ్స్ చివర్లో హెన్రిక్ క్లాసెన్ (Heinrich Klaasen)

DC vs SRH: అభిషేక్, క్లాసెన్ అర్ధ సెంచరీలు.. హైదరాబాద్ భారీ స్కోరు

ఢిల్లీ: తొలుత అభిషేక్ శర్మ (Abhishek Sharma), ఇన్నింగ్స్ చివర్లో హెన్రిక్ క్లాసెన్ (Heinrich Klaasen) విరుచుకుపడడంతో ఢిల్లీ కేపిటల్స్‌(DC)తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 197 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అభిషేక్ శర్మ 36 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో 67 పరుగులు చేయగా, క్లాసెన్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 (నాటౌట్) పరుగులు చేశాడు. అబ్దుల్ సమద్ 28, అకీల్ హొసీన్ 16 (నాటౌట్) పరుగులు చేశారు. మయాంక్ అగర్వాల్ (5), రాహుల్ త్రిపాఠి (10), కెప్టెన్ మార్కరమ్ (8), హారీ బ్రూక్ 0) దారుణంగా నిరాశ పరిచారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ 4 వికెట్లు తీసుకున్నాడు.

Updated Date - 2023-04-29T21:28:34+05:30 IST