Home » Sports » Cricket News
అయితే చెప్పుకోవడానికి ఇంత గ్రాండ్‌గా అనిపిస్తున్నప్పటికీ గడిచిన సీజన్-2024లో ఐపీఎల్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ వ్యాల్యూ భారీగా పడిపోయింది. ఐపీఎల్ 2023లో సీజన్ ఐపీఎల్ బిజినెస్ వ్యాల్యూ 11.2 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఈ ఏడాది సీజన్లో ఏకంగా 9.9 బిలియన్ డాలర్ల స్థాయికి క్షీణించింది.
ఐర్లాండ్ తరఫున 35 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు, 53 టీ20లు ఆడిన భారత సంతతి ఆల్ రౌండ్ క్రికెటర్ సిమీ సింగ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తీవ్రమైన కాలేయ సమస్యతో బాధపడుతున్న అతడు ప్రస్తుతం గురుగ్రామ్ ఆసుపత్రిలో ఐసీయూలో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. కాలేయ మార్పిడి కోసం క్రికెటర్ ఎదురుచూస్తున్నాడని తెలిపింది.
దాయాది దేశం పాకిస్థాన్‌కు దారుణమైన ఓటమి ఎదురైంది. రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఆ జట్టు ఓడిపోయింది. దీంతో 0-2 తేడాతో ఆతిథ్య పాకిస్థాన్ సిరీస్‌ను కోల్పోయింది. స్వదేశంలో జరిగిన సిరీస్‌లో పాకిస్థాన్ ఇంతదారుణంగా ఓడిపోవడం ఆ జట్టుకు అవమానకరంగా మారింది.
కరాచీ వేదికగా ఈ నెల 30 నుంచి పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ షురూ కానుంది. అయితే ప్రేక్షకులు లేకుండానే ఈ మ్యాచ్ జరగనుంది.
శ్రీలంకతో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌లు పూర్తయ్యాయి. పొట్టి ఫార్మాట్ సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు.. వన్డే సిరీస్‌ను మాత్రం చేజార్చుకుంది. ఆగస్టు 7తో మూడు మ్యా్చ్‌ల వన్డే సిరీస్ పూర్తయ్యింది.
భారత బౌలర్లు మరోసారి రాణించారు. కొలంబో వేదికగా శ్రీలంక జరుగుతున్న రెండో వన్డేలో అంచనాలకు తగ్గట్టు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారు. స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌కు తోడు కుల్దీప్ యాదవ్ కూడా రాణించడంతో ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 స్కోర్ నమోదు చేసింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నాడు. ఇటీవలే అతడి నాయకత్వంలోని భారత్ టీ20 వరల్డ్ కప్-2024ను ముద్దాడింది. ఇక వ్యక్తిగతంగా ఫామ్ దృష్ట్యా కూడా హిట్‌మ్యాన్ అద్భుతంగా రాణిస్తున్నాడు.
ఐపీఎల్ మెగా వేలం రాబోతున్న తరుణంలో.. ఫ్రాంచైజీ యజమానులు, ఐపీఎల్ పాలక మండలి మధ్య సమావేశం జరిగింది. ముంబై వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఈ భేటీలో..
భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. క్యాన్సర్‌కు లండన్‌లో గల కింగ్స్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవల భారత్ తిరిగొచ్చారు. ఆ వెంటనే మృతిచెందారు. గైక్వాడ్ మృతిపట్ల పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.
టీమిండియా (టీ20) కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో..