Share News

Ashwin: కల నెరవేరడంతో అలా..!!

ABN , Publish Date - Jul 23 , 2024 | 07:00 PM

టీమిండియా టీ 20 వరల్డ్ కప్‌ గెలిచిన తర్వాత స్టేడియంలో జరిగిన ఓ ఘటనను స్పిన్ మెస్ట్రో రవిచంద్రన్ అశ్విన్ రివీల్ చేశారు. వరల్డ్ కప్ గెలవడాన్ని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకు అనుగుణంగా కప్ గెలిచి ద్రావిడ్‌కు గిప్ట్ ఇవ్వాలని సభ్యులు భావించారు. కలిసికట్టుగా ఆడి, చివరికి కప్పు కొట్టారు.

Ashwin: కల నెరవేరడంతో అలా..!!
Ravichandran Ashwin

టీమిండియా టీ 20 వరల్డ్ కప్‌ గెలిచిన తర్వాత స్టేడియంలో జరిగిన ఓ ఘటనను స్పిన్ మెస్ట్రో రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) రివీల్ చేశారు. వరల్డ్ కప్ గెలవడాన్ని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకు అనుగుణంగా కప్ గెలిచి ద్రావిడ్‌కు గిప్ట్ ఇవ్వాలని సభ్యులు భావించారు. కలిసికట్టుగా ఆడి, చివరికి కప్పు కొట్టారు. మ్యాచ్ గెలిచిన తర్వాత స్టేడియంలో జరిగిన ఘటనను ఆశ్విన్ గుర్తుచేశారు. కప్పు ఎత్తిన తర్వాత కోచ్ రాహుల్ ద్రావిడ్ పెద్దగా అరిచాడు.. ఆ తర్వాత ఉద్వేగంతో కంటి నుంచి నీరు వచ్చిందని చెప్పుకొచ్చారు.


ద్రావిడ్‌‌కు కప్పు అందజేత

‘వరల్డ్ కప్‌ విరాట్ కోహ్లి చేతిలో ఉంది. రాహుల్ ద్రావిడ్‌ను పిలిచి కప్ అందజేశారు. ద్రావిడ్ కప్‌‌ను హత్తుకున్నాడు. ఆ తర్వాత ఏడ్చాడు. ద్రావిడ్ భావోద్వేగానికి గురయ్యే సందర్భాన్ని నేను దగ్గరుండి చూశా. ఉద్వేగానికి గురై.. సంతోషించాడు అని’ రవిచంద్రన్ అశ్విన్ వివరించారు. రాహుల్ ద్రావిడ్ కెరీర్‌లో వరల్డ్ కప్ అందుకోవడం ఇదే తొలిసారి. క్రికెటర్‌గా ద్రావిడ్ వరల్డ్ కప్ అందుకోలేదు. కోచ్‌గా మాత్రం కప్పును ముద్దాడారు. అందుకే కాబోలు ఉద్వేగానికి గురయ్యారు. టీ 20 వరల్డ్ కప్ కోచ్‌‌గా వెళ్లే సమయంలో ద్రావిడ్ కాస్త భయపడ్డారు. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది.


ఇదీ విషయం

టీ 20 వరల్డ్ కప్, అందులో కరేబియాలో జరగడం అందుకు కారణం. 2007లో వన్డే వరల్డ్ కప్ అక్కడే జరిగింది. ఆ సమయంలో ఇండియా జట్టు గ్రూప్ దశలో వెనుదిరిగింది. టీమిండియా కెప్టెన్‌గా రాహుల్ ద్రావిడ్ వ్యవహరించాడు. జట్టు దారుణ పరాజయంతో కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. తర్వాత వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించలేదు. ఓ కెప్టెన్‌గా ద్రావిడ్ ఫెయిల్ అయ్యాడు. కోచ్‌గా మాత్రం సక్సెస్ అయ్యాడు. గతనుభవాలను పాఠాలుగా మలచుకొని, కుర్రాళ్లతో టీ 20 వరల్డ్ కప్ చక్కగా ఆడించాడు. కప్పు గెలిచి తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. తాను చేయలేనిది, జట్ట సభ్యులతో చేయించాడు. దేశానికి టీ 20 వరల్డ్ కప్ తీసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి..

Indian team selection : ఏ సిరీస్‌ ఆడాలనేది.. ఇకపై ఆటగాళ్ల ఇష్టం కాదు
Tennis : టెన్నిస్‌ త్రయం.. తెచ్చేనా పతకం?
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 23 , 2024 | 07:01 PM