Share News

Team India: రోహిత్ తర్వాత టీమిండియా భవిష్య కెప్టెన్ అతడే.. అగర్కార్ క్లారిటీ

ABN , Publish Date - Jul 22 , 2024 | 08:34 PM

ఇప్పుడంటే టీ20లకు సూర్యకుమార్ యాదవ్‌ని కెప్టెన్‌గా నియమించి.. మిగిలిన రెండు పార్మాట్లకు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. మరి.. ఆ తర్వాత సంగతేంటి?

Team India: రోహిత్ తర్వాత టీమిండియా భవిష్య కెప్టెన్ అతడే.. అగర్కార్ క్లారిటీ
Ajit Agarkar

ఇప్పుడంటే టీ20లకు సూర్యకుమార్ యాదవ్‌ని (Suryakumar Yadav) కెప్టెన్‌గా నియమించి.. మిగిలిన రెండు పార్మాట్లకు (వన్డే, టెస్టు) రోహిత్ శర్మనే (Rohit Sharma) కెప్టెన్‌గా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. మరి.. ఆ తర్వాత సంగతేంటి? టీమిండియా భవిష్య కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. తాజాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కార్ (Ajit Agarkar) ఆ సందేహానికి తెరదించాడు. భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను (Shubman Gill) పూర్తిస్థాయి కెప్టెన్‌గా చూసే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చాడు. అయితే.. ఏ విషయంలోనూ తాము క్లారిటీ ఇవ్వలేమని, ఇప్పుడున్నపరిస్థితుల దృష్ట్యా తమ ఓటు గిల్‌కే అని ఆయన తేల్చి చెప్పాడు.


సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. మూడు ఫార్మాట్లలోనూ గిల్ రాణించగలడని, అతడో కీలక ఆటగాడు అని తెలిపాడు. గత ఏడాది నుంచి అతడు అద్భుతంగా ఆడుతున్నాడని కొనియాడాడు. సూర్య, రోహిత్‌ ఉన్నపుడే.. నాయకుడి నైపుణ్యాలు మెరుగుపరచుకునేలా గిల్‌కి శిక్షణ ఇవ్వాలని అన్నాడు. ఉన్నట్లుండి ఒక్కసారిగా కొత్త కెప్టెన్‌ను ట్రై చేయాలంటే కష్టమవుతుందని.. అందుకే ఇప్పటి నుంచే అతనిని భవిష్య కెప్టెన్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని పేర్కొన్నాడు. అయితే.. ఇందుకు చాలా సమయం ఉందని, ఇప్పుడే ఏదీ కచ్చితంగా చెప్పలేమని ట్విస్ట్ ఇచ్చాడు. రెండేళ్లపాటు అతడిని గమనిస్తూనే ఉంటామని వెల్లడించాడు. అంటే.. ఈ రెండేళ్లు అతడు సమర్థవంతంగా రాణిస్తే, భవిష్య కెప్టెన్ అతడేనని ఫిక్స్ అయిపోవచ్చు.


నిజానికి.. ఈ కెప్టెన్సీ రేసులో గిల్ కంటే ముందు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్లు ఉన్నారు. అయితే.. ఆయా కారణాల దృష్ట్యా వారిని పక్కన పెట్టి, గిల్‌కే పట్టం కట్టాల్సి వచ్చిందని అజిత్‌ అగార్కర్‌ చెప్పాడు. రోడ్డు ప్రమాదం కారణంగా రిషభ్ పంత్ చాలాకాలం పాటు ఆటకు దూరమయ్యాడని, ఏడాదిన్నర తర్వాత జట్టులోకి వచ్చిన అతనిపై భారం మోపాలని భావించడం లేదన్నాడు. అలాగే.. కేఎల్ రాహుల్ చాలాకాలంగా టీ20లకు దూరంగా ఉన్నాడని, ఇక హార్దిక్ ఫిట్‌నెస్ దృష్ట్యా అతడినీ ఎంపిక చేయలేదని క్లారిటీ ఇచ్చాడు. గతంలో తాము టీ20 కెప్టెన్ విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నామని.. మరోసారి అలాంటి రిస్కులు చేసేందుకు సిద్ధంగా లేమని అగార్కర్ చెప్పుకొచ్చాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 22 , 2024 | 08:34 PM